RRB JE Recruitment 2025 : ఇండియన్ రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB JE Recruitment 2025 Overview
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) |
పోస్టు పేరు | జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ |
పోస్టుల సంఖ్య | 2,570 |
దరఖాస్తు ప్రక్రియ | 31 అక్టోబర్ – 30 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
ఖాళీల వివరాలు (Vacancy Details) :
రైల్వే డిపార్ట్మెంట్ లో వివిధ టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టుల పేర్లు : జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
- ఖాళీల సంఖ్య : 2,570
అర్హతలు(Eligibility) :
RRB JE Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుంచి సంబధిత విభాగంలో ఇంజనీరింగ్ లో డిగ్రీ / డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి(Age Limit) :
RRB JE Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
RRB JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ | రూ.500/- |
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఈఎస్ఎమ్ / మహిళలు | రూ.250/- |
ఎంపిక ప్రక్రియ (Selection Process):
RRB JE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-I)
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-II)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Also Read : UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..
జీతం వివరాలు(Salary) :
RRB JE Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
RRB JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 31 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
Also Read : SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
SK Yakub
Hanumakonda (Di)
Dharmasagar (ma)
Kasim nagar (Vi)