RITES Recruitment 2025 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే RITES Ltd. (Rail India Technical and Economic Service) సంస్థలో వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
- పోస్టు పేరు : సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
- ఖాళీల సంఖ్య : 600
Also Read : Realme GT 8, GT 8 Pro Launch Date & Specifications
అర్హతలు :
అభ్యర్థులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
అభ్యర్థులకు 12.11.2025 నాటికి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులకు రాత పరీక్షలో హాజరైతే ఫీజు రిఫండ్ అవుతుంది.
- జనరల్ / ఓబీసీ : రూ.300 + ట్యాక్స్
- EWS / SC / ST / PwBD : రూ.100 + ట్యాక్స్
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 2.5 గంటల సమయం ఇస్తారు. నెగటివ్ మార్కింగ్ లేదు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : RRC NER Sports Quota Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ – ఇలా అప్లయ్ చేయండి
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ బేసిస్‌పై ఒక సంవత్సరం పాటు నియామకం ఉంటుంది. అవసరాన్ని బట్టి పొడిగించబడుతుంది. అభ్యర్థులుకు నెలకు రూ.29,735/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
- అధికారిక వెబ్‌సైట్ www.rites.com లోకి వెళ్లాలి.
- Careers → Online Registration పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన సర్టిఫికేట్లు PDF ఫార్మాట్‌లో అప్లోడ్ చేయండి (10వ సర్టిఫికెట్, విద్యార్హతలు, అనుభవ పత్రాలు మొదలైనవి).
- ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి ఫైనల్ అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత Registration No. గుర్తుంచుకోండి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14 అక్టోబర్ 2025
- దరఖాస్తు చివరి తేదీ: 12 నవంబర్ 2025
- రాత పరీక్ష తేదీ: 23 నవంబర్ 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : AIASL Passenger Service Agent (Trainee) Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో ట్రైనీ పోస్టులు
1 thought on “RITES Recruitment 2025 | RITES సంస్థలో 600+ ఇంజినీరింగ్ పోస్టులు!”