RCF Kapurthala Sports Quota Recruitment 2025: కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో లెవల్-1 మరియు లెవల్-2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోపు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి.

RCF Kapurthala Sports Quota Recruitment 2025 Overview
నియమక సంస్థ | రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలా |
పోస్టు పేరు | స్పోర్ట్స్ కోటా లెవల్-1 మరియు లెవల్-2 |
ఖాళీల సంఖ్య | 23 |
దరఖాస్తులకు చివరి తేదీ | 29 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ (పోస్ట్ ద్వారా) |
జాబ్ లొకేషన్ | కపుర్తలా, పంజాబ్ |
Also Read : BHEL Trichy Apprentice Notification 2025 | 760 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి లెవల్-1 మరియు లెవల్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్రీడా విభాగాల వారీగా ఖాళీలు :
క్రీడా విభాగాలు | లెవల్ | ఖాళీలు |
హాకీ (పురుషులు) | లెవల్-2 | 02 |
హాకీ (మహిళలు) | లెవల్-2 | 04 |
వెయిట్ లిఫ్టింగ్ (మహిళలు) | లెవల్-2 | 02 |
ఫుట్ బాల్ (పురుషులు) | లెవల్-1 | 03 |
బాస్కెట్ బాల్(పురుషులు) | లెవల్-1 | 03 |
అథ్లెటిక్స్ (మహిళలు) | లెవల్-1 | 02 |
స్విమ్మింగ్ (మహిళలు – ఫ్రీ స్టైల్) | లెవల్-1 | 02 |
రెజ్లింగ్(పురుషులు – గ్రీకో రోమన్) | లెవల్-1 | 02 |
రెజ్లింగ్(పురుషులు – ఫ్రీ స్టైల్) | లెవల్-1 | 01 |
మొత్తం | 23 |
అర్హతలు :
RCF Kapurthala Sports Quota Recruitment 2025 పోస్టు లెవల్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి.
- లెవల్-1 పోస్టులకు : 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ + స్పోర్ట్స్ సర్టిఫికెట్
- లెవల్-2 పోస్టులకు : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ / అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ + స్పోర్ట్స్ సర్టిఫికెట్
వయోపరిమితి :
RCF Kapurthala Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
RCF Kapurthala Sports Quota Recruitment 2025 అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా ఫీజు చెల్లించాలి.
కేటగిరీ | ఫీజు | రీఫండ్ |
జనరల్ / ఓబీసీ | రూ.500/- | ట్రయల్స్ లో హాజరైన తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు. |
SC / ST / PWD / EBC / మాజీ సైనికులు / మహిళలు / మైనారిటీలు | రూ.250/- | ట్రయల్స్ లో హాజరైన తర్వాత పూర్తి ఫీజు చెల్లిస్తారు. |
ఎంపిక ప్రక్రియ:
RCF Kapurthala Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- క్రీడా విజయాలు (50 మార్కులు)
- ట్రయల్స్ సమయంలో ఆట నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ మరియు కోచ్ పరిశీలన (40 మార్కులు
- విద్యార్హత (10 మార్కులు)
Also Read : NHAI AI Engineer Recruitment 2025 | రూ.2.5 లక్షల జీతంతో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి
జీతం వివరాలు :
RCF Kapurthala Sports Quota Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుంది.
- లెవల్-1 పోస్టులకు : రూ.18,000 – రూ.56,900/-
- లెవల్-2 పోస్టులకు : రూ.19,900 – రూ.63,200/-
దరఖాస్తు విధానం :
RCF Kapurthala Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో మరియు స్వీయ ధ్రువీకరించిన డాక్యుమెంట్స్ ని జత చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించిన రసీదు జత్ చేయాలి.
- కవర్ మీద ‘”RECRUITMENT AGAINST SPORTS QUOTA FOR THE YEAR 2025-2026 IN LEVEL-01 OR LEVEL-02’ రాయాలి
- పూర్తి చేసిన అప్లికేషన్ ని కింది అడ్రస్ కి పంపాలి.
- అడ్రస్ : జనరల్ మేనేజర్(పర్సనల్), రిక్రూట్మెంట్ సెల్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలా, పంజాబ్ – 144602
దరఖాస్తులకు చివరి తేదీ : 29 సెప్టెంబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : IB Security Assistant MT Jobs 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Tq
Very good
Tq