RBI Office Attendant Recruitment 2026 : బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. Reserve Bank of India (RBI) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో Office Attendant పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి అర్హతతో మొత్తం 572 పోస్టులు భర్తీ చేయనున్నారు. మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు, స్థిరమైన ఉద్యోగ భద్రతతో ఇది చాలా మందికి డ్రీమ్ జాబ్‌గా మారే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు (Vacancy Details-RBI Office Attendant Recruitment 2026)
ఈ నోటిఫికేషన్ ద్వారా కింది పోస్టులు భర్తీ చేయనున్నారు.
- Office Attendant (Peon) – 572 పోస్టులు
- దేశవ్యాప్తంగా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు
- పోస్టింగ్ మాత్రం మీరు అప్లై చేసిన రాష్ట్రంలోనే ఉంటుంది
- ఇది పర్మనెంట్ RBI ఉద్యోగం
అర్హతలు (Educational Qualification-RBI Office Attendant Recruitment 2026)
- అభ్యర్థి 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణుడై ఉండాలి
- అప్లై చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన లోకల్ భాష చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి
- సంబంధిత రాష్ట్రంలో నివాస అర్హత ఉండాలి
వయోపరిమితి (Age Limit)
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
వయో సడలింపు:
- SC / ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- PwBD – గరిష్టంగా 10 సంవత్సరాలు
- Ex-Servicemen – ప్రభుత్వ నిబంధనల ప్రకారం
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- SC / ST / PwBD / Ex-Servicemen: ₹50
- UR / OBC / EWS: ₹450
ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
RBI Office Attendant ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.
- ఆన్‌లైన్ రాత పరీక్ష (Objective Test)
- భాషా ప్రావీణ్య పరీక్ష (Local Language Test)
జీతం వివరాలు (Salary Details)
- ప్రారంభ జీతం సుమారు ₹23,000 – ₹25,000
- అలవెన్సులతో కలిపి నెలకు సుమారు ₹46,000 వరకు జీతం
- అదనంగా DA, HRA, మెడికల్, పెన్షన్ వంటి కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు
దరఖాస్తు విధానం (How to Apply)
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి:
- www.rbi.org.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- “Recruitment for Office Attendant” లింక్‌పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపండి
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి
- అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయండి
- అప్లికేషన్ కాపీ డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం : 15 జనవరి, 2025
- చివరి తేదీ : 4 ఫిబ్రవరి, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |