RBI Assistant Recruitment 2026 | 650 బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

RBI Assistant Recruitment 2026 : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ సంస్థలలో ఒకటైన Reserve Bank of India (RBI) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న RBI కార్యాలయాల్లో మొత్తం 650 ఖాళీలు ఉన్నాయి. ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం .

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 Assistant పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీలు అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి వివిధ RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్నాయి. SC, ST, OBC, EWS, PwBD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి. ఖాళీల సంఖ్య అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉంది.

  • పోస్టు పేరు : అసిస్టెంట్
  • మొత్తం ఖాళీలు : 650

అర్హతలు (Educational Qualification)

RBI Assistant Recruitment 2026 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కనీసం 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులకు పాస్ క్లాస్ సరిపోతుంది. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి. అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి .

వయోపరిమితి (Age Limit)

RBI Assistant Recruitment 2026 01 ఫిబ్రవరి 2026 నాటికి అభ్యర్థి వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • SC / ST: 5 సంవత్సరాలు
  • OBC: 3 సంవత్సరాలు
  • PwBD: గరిష్టంగా 10–15 సంవత్సరాలు
  • ఎక్స్ సర్వీస్‌మన్ మరియు ఇతర కేటగిరీలకు ప్రత్యేక సడలింపులు వర్తిస్తాయి .

అప్లికేషన్ ఫీజు (Application Fee)

RBI Assistant Recruitment 2026 ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు. 

  • SC / ST / PwBD / Ex-Servicemen: ₹50 (ఇంటిమేషన్ ఛార్జ్)
  • GEN / OBC / EWS: ₹450 + GST

ఎంపిక ప్రక్రియ (Selection Process)

RBI Assistant Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట Preliminary Examination ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు Main Examination రాయాలి. తరువాత ఎంపికైన అభ్యర్థులకు Language Proficiency Test (LPT) నిర్వహిస్తారు. ప్రతి దశలో కనీస అర్హత మార్కులు తప్పనిసరి. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

RBI Assistant సిలబస్ 

Prelims Syllabus

  • English Language
  • Numerical Ability
  • Reasoning Ability

Mains Syllabus

  • Reasoning
  • Quantitative Aptitude
  • English Language
  • General Awareness (Banking)
  • Computer Knowledge

Language Proficiency Test (LPT)

  • స్థానిక భాష చదవడం
  • రాయడం
  • మాట్లాడడం

జీతం వివరాలు (Salary Details)

RBI Assistant Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ జీతం సుమారు ₹29,000 ఉంటుంది. మొత్తం గ్రాస్ సాలరీ సుమారు ₹58,000+ ఉంటుంది. DA, HRA, మెడికల్, హౌసింగ్ లోన్, ట్రావెల్ అలవెన్స్ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రమోషన్ అవకాశాలు కూడా మంచి స్థాయిలో ఉంటాయి .

దరఖాస్తు విధానం (How to Apply)

RBI Assistant Recruitment 2026 అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఫోటో, సంతకం, thumb impression, handwritten declaration అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ సేవ్ చేసుకోవాలి 

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16 ఫిబ్రవరి 2026
  • చివరి తేదీ: 08 మార్చి 2026
Notification Click here
Apply OnlineClick here

Also Read : NTPC EET Recruitment 2026 | విద్యుత్ సంస్థలో భారీ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!