Railway SECR Recruitment 2025 సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ టీచర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 84 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల నియామకాలు చేపడుతున్నారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపికలు చేస్తారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Railway SECR Recruitment 2025
పోస్టుల వివరాలు :
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ టీచర్స్ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 84 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేేశారు.
అర్హతలు :
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు అర్హతలు కింది విధంగా ఉన్నాయి.
● పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT) : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులత మాస్టర్స్ డిగ్రీ తో పాటు B.Ed లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి.
● ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT): ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దీంతో పాటు B.Ed లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
● ప్రైమరీ స్కూల్ టీచర్స్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో 2 సంవత్సరాల డిప్లొమా(D.EI.Ed) కలిగి ఉండాలి. అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ:
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తారు.
జీతం :
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,250/- నుంచి రూ.27,500/- వరకు పోస్టులను అనుసరించి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
Railway SECR Recruitment 2025 PGT, TGT మరియు ప్రైమరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాలో జరుగుతాయి. ఇంటర్వ్యూ షెడ్యూల్ కింది విధంగా ఉంటుంది.
● పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT) : 05 – 03 – 2025
● ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) : 06 – 03 – 2025
● ప్రైమరీ స్కూల్ టీచర్ : 07 – 03 – 2025
● వర్చువల్ మోడ్ ద్వాారా MHS/SDL : 10 – 03 – 2025
అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
- ఒరిజనల్ విద్యార్హత సర్టిఫికెట్స్
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (ఒకవేళ ఉంటే)
Notification & Application : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “Railway SECR Recruitment 2025 | రైల్వే శాఖలో పార్ట్ టైమ్ టీచర్స్ జాబ్స్”