Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు

Rail Coach Factory Apprentice Recruitment 2025 : రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Rail Coach Factory (RCF), కపుర్తలా నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 550 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.  ITI పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 07 జనవరి 2026 రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 

ఖాళీల వివరాలు (Vacancy Details)

RCF కపుర్థాలా వివిధ ట్రేడ్స్‌లో శిక్షణ కోసం డైరెక్ట్‌గా అభ్యర్థులను ఎంపిక చేసుకోనుంది. మొత్తం 550 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ట్రేడ్‌కు సంబంధించిన సీట్ల సంఖ్య క్రింద ఇచ్చాం.

ట్రేడ్ఖాళీలు
Fitter150
Welder (G&E)180
Machinist20
Painter30
Carpenter30
Electrician70
AC & Refrigeration Mechanic30
Mechanic Motor Vehicle20
Electronic Mechanic20
మొత్తం550 

Also Read : RRC NR Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

అర్హతలు (Eligibility Criteria)

Rail Coach Factory Apprentice Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేయేందుకు అవసరమైన కనీస అర్హతలు..

  • 10వ తరగతిలో కనీసం 50% మార్కులు 
  • ITI సర్టిఫికేట్ — ట్రేడ్‌కు సంబంధించిన NCVT/SCVT సర్టిఫికేట్ తప్పనిసరి.
  • మార్కులు CGPA లో ఉంటే, నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం శాతం మార్చాలి.

వయోపరిమితి (Age Limit)

Rail Coach Factory Apprentice Recruitment 2025 దరఖాస్తు చివరి తేదీ 07.01.2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee)

Rail Coach Factory Apprentice Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు పూర్తిగా ఆన్ లైన్ లో చెల్లించాలి. 

  • General / OBC / EWS: ₹100/-
  • SC / ST / PwD / Women: ఫీజు లేదు.

ఎంపిక విధానం (Selection Process)

Rail Coach Factory Apprentice Recruitment 2025 RCF ఈ నియామకంలో ఎలాంటి పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా merit list ఆధారంగా జరుగుతుంది. 

మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారు?

  • 10వ తరగతి శాతం (50% కంటే తక్కువ కాకూడదు)
  • ITI మార్కులు
  • రెండింటి సగటుతో ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • ఎంపికైన అభ్యర్థులు అసలు సర్టిఫికేట్లు చూపాలి.
  • ప్రభుత్వ వైద్యాధికారి సర్టిఫై చేసిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి.

స్టైపెండ్ వివరాలు (Stipend)

Rail Coach Factory Apprentice Recruitment 2025 శిక్షణ సమయంలో స్టైపెండ్ Railway Board నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. Hostel సౌకర్యం ఉండదు. అభ్యర్థులు స్వయంగా వసతి ఏర్పాట్లు చేసుకోవాలి. 

దరఖాస్తు విధానం (How to Apply)

Rail Coach Factory Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. అధికారిక వెబ్‌సైట్‌ www.rcf.indianrailways.gov.in కి వెళ్లండి.
  2. Apprentice Recruitment సెక్షన్ లో Online Application క్లిక్ చేయండి.
  3. మీ వ్యక్తిగత వివరాలు మరియు ITI/10th వివరాలు జాగ్రత్తగా నమోదు చేయండి.
  4. ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి. ఫోటో సైజు 20 KB – 70 KB మరియు సిగ్నేచర్ సైజు  20 KB – 30 KB ఉండాలి. 
  5. ఫీజు చెల్లించండి.
  6. ఫైనల్ సమ్మిషన్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకుని నిల్వ చేసుకోండి.

దరఖాస్తులకు చివరి తేదీ : 07 జనవరి 2026 – రాత్రి 12 గంటలు

NotificationClick here
Apply OnlineClick here

Also Read : CSIR–NGRI MTS Recruitment 2025: హైదరాబాద్‌లో 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

1 thought on “Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!