PRL Recruitment 2025 : భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ పరిధిలోని ప్రముఖ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అయిన ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ(PRL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PRL Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ |
| శాఖ | భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ |
| పోస్టు పేర్లు | టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్-బి |
| పోస్టుల సంఖ్య | 20 |
| దరఖాస్తు ప్రక్రియ | 4 అక్టోబర్ – 31 అక్టోబర్, 2025 |
| జాబ్ లొకేషన్ | అహ్మదాబాద్, ఉదయ్ పూర్, మౌంట్ అబు |
Also Read : BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 86 ఖాళీలు.. ఇలా అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు :
భౌతిక పరిశోధన ప్రయోగశాల (Physical Research Laboratory – PRL), అంతరిక్ష విభాగం కింద ఉన్న ప్రముఖ శాస్త్రీయ సంస్థ. ఈ సంస్థ చంద్రయాన్-1, మంగళ్‌యాన్, చంద్రయాన్-3, ఆదిత్య-L1 వంటి ప్రధాన అంతరిక్ష మిషన్లలో విశేషమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం PRL లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-B పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
టెక్నికల్ అసిస్టెంట్ : 10 పోస్టులు
| ట్రేడ్ పేరు | ఖాళీలుఅ |
| సివిల్ | 2 |
| మెకానికల్ | 2 |
| ఎలక్ట్రికల్ | 2 |
| కంప్యూటర్ సైన్స్ / ఐటీ | 3 |
| ఎలక్ట్రానిక్స్ | 1 |
| మొత్తం | 10 |
టెక్నీషియన్ : 10 పోస్టులు
| ట్రేడ్ పేరు | ఖాళీలు |
| ఫిట్టర్ | 1 |
| టర్నర్ | 2 |
| మెషినిస్ట్ | 1 |
| ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 2 |
| ఎలక్ట్రీషియన్ | 2 |
| ప్లంబర్ | 1 |
| RAC మెకానికల్ | 1 |
| మొత్తం | 10 |
అర్హతలు :
PRL Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోండి.
- టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫస్ట్ క్లాస్ డిప్లొమా (Civil/Mechanical/Electrical/Computer Science/IT/Electronics).
- టెక్నీషియన్-B: 10వ తరగతి పాస్ + ITI/NTC/NAC (సంబంధిత ట్రేడ్‌లో, NCVT గుర్తింపు పొందినది కావాలి).
వయోపరిమితి :
PRL Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
PRL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ (ఎస్బీఐ చలాన్ ) ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
టెక్నికల్ అసిస్టెంట్ :
- ఫీజు : రూ.250/-
- ప్రారంభంలో అందరూ ₹750 చెల్లించాలి
- పరీక్షకు హాజరైతే SC/ST/ PwBD/ మహిళలకు మొత్తం ఫీజు రిఫండ్ అవుతుంది.
- UR/OBC/EWS కు ₹500 రిఫండ్ అవుతుంది.
టెక్నీషియన్-బి :
- ఫీజు : రూ.100/-
- ప్రారంభంలో అందరూ ₹500 చెల్లించాలి.
- పరీక్షకు హాజరైతే SC/ST/PwBD/ మహిళలకు మొత్తం రిఫండ్
- UR/OBC/EWS కు ₹400 రిఫండ్ అవుతుంది
ఎంపిక ప్రక్రియ:
PRL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- పరీక్ష కేంద్రాలు : అహ్మదాబాద్(గుజరాత్), అబు రోడ్ మరియు ఉదయ్ పూర్(రాజస్థాన్)
Also Read : VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్
జీతం వివరాలు :
PRL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంద.
- టెక్నికల్ అసిస్టెంట్ : ₹44,900/- (Level 7) + HRA + DA + ఇతర అలవెన్సులు.
- టెక్నీషియన్-బి : ₹21,700/- (Level 3) + HRA + DA + ఇతర అలవెన్సులు.
- ఉద్యోగులకు NPS, మెడికల్ సదుపాయాలు, LTC, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి లాభాలు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం :
PRL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.prl.res.in/OPAR లోకి వెళ్లాలి.
- టెక్నికల్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్-బి కోసం సంబంధిత లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 4 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 అక్టోబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “PRL Recruitment 2025 | అంతరిక్ష పరిశోధన సంస్థలో జాబ్స్”