PNB Apprentice Recruitment 2026 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5138 పోస్టులు

PNB Apprentice Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో అనుభవంతో కూడిన కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంచి అవకాశం అందిస్తోంది. Punjab National Bank (PNB) దేశవ్యాప్తంగా Apprentices Act, 1961 కింద అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం ట్రైనింగ్‌తో పాటు నెలవారీ స్టైపెండ్ లభిస్తుంది. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5138 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీలు రాష్ట్రం, సర్కిల్ మరియు కేటగిరీ వారీగా ఉన్నాయి. SC, ST, OBC, EWS మరియు PwBD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఖాళీల సంఖ్య అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉందని బ్యాంక్ స్పష్టం చేసింది.

అర్హతలు (Educational Qualification)

PNB Apprentice Recruitment 2026 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫలితాలు 31 డిసెంబర్ 2025 లోపు ప్రకటించబడి ఉండాలి. దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. అప్రెంటిస్ ట్రైనింగ్ ఇప్పటికే చేసినవారు అర్హులు కాదు.

వయోపరిమితి (Age Limit)

PNB Apprentice Recruitment 2026 01 జనవరి 2026 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి.

  • SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  • OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • PwBD అభ్యర్థులకు గరిష్టంగా 10 సంవత్సరాలు
    ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

PNB Apprentice Recruitment 2026 అప్లికేషన్ మరియు పరీక్ష ఫీజు కేటగిరీ ఆధారంగా ఉంటుంది.

  • GEN / OBC / EWS (Male): ₹944 (GST సహా)
  • GEN / OBC / EWS (Female): ₹708 (GST సహా)
  • SC / ST / PwBD / Transgender: ₹236 (GST సహా)
    ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

PNB Apprentice Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది.
మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష (100 మార్కులు) ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ & రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

జీతం / స్టైపెండ్ వివరాలు (Stipend Details)

PNB Apprentice Recruitment 2026 అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.

  • Rural / Semi-Urban / Urban బ్రాంచ్‌లు: ₹12,300
  • Metro బ్రాంచ్‌లు: ₹15,000
    ఇతర అలవెన్సులు ఉండవు. ట్రైనింగ్ కాలం పూర్తయ్యాక ఉద్యోగ హామీ ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది.

దరఖాస్తు విధానం (How to Apply)

PNB Apprentice Recruitment 2026 అభ్యర్థులు https://www.bfsissc.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా BFSI SSC పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. అదనంగా NAPS / NATS పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అప్లికేషన్ చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026.

ముఖ్యమై తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం : 08 ఫిబ్రవరి, 2026
  • చివరి తేదీ : 24 ఫిబ్రవరి, 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : BSNL SET Recruitment 2026 | BSNLలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!

Leave a Comment

Follow Google News
error: Content is protected !!