PGIMER Recruitment 2025 చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లీగల్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర, స్టోర్ కీపర, నర్సింగ్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ డైటీషియన్ మరియు వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
PGIMER Recruitment 2025 Overview :
నియామక సంస్థ | పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్ |
పోస్టు పేరు | లీగల్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర, స్టోర్ కీపర, నర్సింగ్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ డైటీషియన్ |
పోస్టుల సంఖ్య | 114 |
దరఖాస్తులకు చివరి తేదీ | 4 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి PGIMER చండీగఢ్ మరియు పంజాబ్ లోని సంగూర్ PGI Satellite Centre లో పోస్టింగ్ ఇవ్వబడుతుంద.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
లీగల్ అసిస్టెంట్ | 01 |
టెక్నీషియన్ ఓటీ | 04 |
జూనియర్ టెక్నీషియన్(ల్యాబ్) | 31 |
జూనియర్ టెక్నీషియన్(ఎక్స్-రే) | 06 |
జూనియర్ టెక్నీషియన్(రేడియోథెరపీ) | 03 |
డెంటల్ హైజీనిస్ట్ గ్రేడ్-2 | 02 |
అసిస్టెంట్ డీటీషియన్ | 02 |
రిసెప్షనిస్ట్ | 01 |
జూనియర్ ఆడిటర్ | 01 |
స్టోర్ కీపర్ | 01 |
నర్సింగ్ ఆఫీసర్ | 51 |
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (అప్పర్ డివిజన్ క్లర్క్) | 02 |
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (లోయర్ డివిజన్ క్లర్క్) | 03 |
జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్) | 06 |
అర్హతలు :
PGIMER Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
నర్సింగ్ ఆఫీసర్ | బీఎస్సీ (ఆనర్స్) ఇన్ నర్సింగ్ / బీఎస్సీ నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జిఎన్ఎం)లో డిప్లొమా + ఒక సంవత్సరం అనుభవం |
లీగల అసిస్టెంట్ | 50 శాతం మార్కులతో లా డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం |
టెక్నీషియన్ ఓటీ | బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ(ఆపరేషన్ థియేటర్/ అనస్థీషియా) |
డెంటల్ హైజీనిస్ట్ గ్రేడ్-2 | డెంటల్ హైజీనిస్ట్ లో డిప్లొమా / సర్టిఫికేట్ + డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డెంటల్ హైజీనిస్ట్ గా రిజిస్టర్ అయి ఉండాలి. |
అసిస్టెంట్ డైటీషియన్ | ఎంఎస్సీ(ఫుడ్ అండ్ న్యూట్రీషన్) + 2 సంవత్సరాల అనుభవం |
రిసెప్షనిస్ట్ | ఏదైనా డిగ్రీ + జర్నలిజం / పబ్లిక రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా |
జూనియర్ ఆడిటర్ | బీకామ్ + 2 సంవత్సరాల అనుభవం |
UDC / LDC | ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ లో ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు / హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ |
జూనియర్ టెక్నీషియన్ ఎక్స్-రే | మెడికల్ టెక్నాలజీ(ఎక్స్ -రే) / మెడికల్ టెక్నాలజీ రేడియాలజీలో బీఎస్సీ |
జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియోథెరపీ) | మెడికల్ టెక్నాలజీ (రేడియాలజీ / రేడియోథెరపీ) లో బీఎస్సీ |
జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్) | మెడికల్ ల్యాబ్ లో బీఎస్సీ, టెక్నాలజీ / డిప్లొమా ల్యాబ్ తో బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ |
వయోపరిమితి :
PGIMER Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
PGIMER Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
UR / EWS / OBC | రూ.1500/- |
SC / ST | రూ.800/- |
PwBD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
PGIMER Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- రాత పరీక్ష
- టైపింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
పే స్కేల్ వివరాలు :
PGIMER Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతం |
నర్సింగ్ ఆఫీసర్ | రూ.44,900 – రూ.1,42,400/- |
లీగల్ అసిస్టెంట్,టెక్నీషియన్ ఓటీ, జూనియర్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ గ్రేడ్-2, అసిస్టెంట్ డైటీషియన్, స్టోర్ కీపర్ | రూ.35,400 – రూ.1,12,400/- |
రిసెప్షనిస్ట్ | రూ.29,200 – రూ.92,300/- |
జూనియర్ ఆడిటర్, అప్పర్ డివిజన్ క్లర్క్ | రూ.25,500 – రూ.81,100/- |
లోయర్ డివిజన్ క్లర్క్ | రూ.19,900 – రూ.63,200/- |
దరఖాస్తు విధానం :
PGIMER Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులకు అధికారిక వెబ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ఎగ్జామ్ సెంటర్స్ :
- హైదరాబాద్
- ఢిల్లీ / NCR
- కోల్ కతా
- చండీగఢ్ / మొహాలీ
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 04 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 04 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |