PFRDA Recruitment 2025 | పెన్షన్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు

PFRDA Recruitment 2025 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  PFRDA ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్, ఫైనాన్స్, ఐటీ, లీగల్ మరియు ఇతర విభాగాల్లో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 23వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

PFRDA Recruitment 2025 Overview : 

నియామక సంస్థపెన్షన్ ఫండ్  రెగ్యులేటరీ అండ్  డెవలప్మెంట్ అథారిటీ(PFRDA)
పోస్టు పేరుఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’ (అసిస్టెంట్ మేనేజర్)
పోస్టుల సంఖ్య20
దరఖాస్తులకు చివరి తేదీ06 ఆగస్టు
జాబ్ లొకేషన్భారతదేశంలో ఎక్కడైనా
జీతంనెలకు రూ.1,57,000/-

పోస్టుల వివరాలు : 

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

స్ట్రీమ్ఖాళీలు
జనరల్08
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్02
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ02
రీసెర్చ్(ఎకనామిక్స్)01
రీసెర్చ్ (స్టాటిస్టిక్)02
యాక్చువరీ02
లీగల్02
అఫీషియల్ లాంగ్వేజ్(రాజభాష)01
మొత్తం20

అర్హతలు : 

PFRDA Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి  విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు విభాగాలువిద్యార్హతలు
జనరల్ఏదైనా విభాగంలో  మాస్టర్స్ డిగ్రీ (లేదా) బ్యాచిలర్స్ ఆఫ్ లా (లేదా) ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ICAI నుంచి ACA /FCA లేదా ICSI నుంచి ACA/FCA లేదా ICMAI నుంచి ACMA/FCMA లేదా CFA 
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్గ్రాడ్యుయేషన్ మరియు ICAI నుంచి ACA /FCA లేదా ICSI నుంచి ACA/FCA లేదా ICMAI నుంచి ACMA/FCMA లేదా CFA 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీCS/IT/ECE/EEEలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MCA లేదా AI/ML స్పేషలైజేషన్ ఉన్న పీజీ
రీసెర్చ్  (ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్)ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనోమెట్రిక్స్ / ఫైనాన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్
లీగల్LLB – లా డిగ్రీ
యాక్చువరీగ్రాడ్యుయేషన్  మరియు IAI యొక్క 7 కోర్ ప్రిన్సిపుల్స్ పేపర్స్ లో ఉత్తీర్ణత
అఫీషియల్ లాంగ్వేజ్ (రాజ్ భాష)MA(Hindi) With English in UG లేదా సంస్కృతం/ఇంగ్లీష్ /ఎకనామిక్స్/కామర్స్ లో హిందీని ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ  

వయస్సు  : 

PFRDA Recruitment 2025  పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  ఎస్సీ, ఎస్టీ  అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు  : 

PFRDA Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.  

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
General / OBC / EWSరూ.1,000/-
SC / ST / PwBD / Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ:

PFRDA Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.  

  • స్టేజ్-1 : ఆన్ లైన్ స్ట్రీనింగ్ టెస్ట్
  • స్టేజ్-2 : మెయిన్ ఎగ్జామ్
  • స్టేజ్-3 : ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

PFRDA Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.1,57,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

PFRDA Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజీలో కెరీర్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’(అసిస్టెంట్ మేనేజర్)-2025 పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ23 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ06 ఆగస్టు, 2025
స్టేజ్-1 ఆన్ లైన్ పరీక్ష06 సెప్టెంబర్, 2025
స్టేజ్-2 ఆన్ లైన్ పరీక్ష06 అక్టోబర్, 2025
స్టేజ్-3 ఇంటర్వ్యూతర్వాత తెలియజేస్తారు
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!