NTR University Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగాలకు గుడ్ న్యూస్. ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగాల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NTR Health University Outsourcing Jobs 2025
పోస్టుల వివరాలు :
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ | 02 |
కంప్యూటర్ ఆపరేటర్ | 04 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 09 |
అర్హతలు :
NTR Health University Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ | B.Tech (CSE, ECE, IT) + 2 సంవత్సరాల అనుభవం |
కంప్యూటర్ ఆపరేటర్ | కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ఏదైనా డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | కంప్యూటర్ స్పెషలైజేషన్ తో ఏదైనా డిగ్రీ |
వయస్సు:
NTR University Outsourcing Jobs 2025 సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NTR University Outsourcing Jobs 2025 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
NTR University Outsourcing Jobs 2025 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థుల విద్యార్హతల్లో(భాషలు మినహా) వచ్చిన మార్కులకు 75 శాతం మార్కులు కేటాయిస్తారు. స్కిల్ టెస్ట్ కి 25 శాతం మార్కులు ఉంటాయి. ఈ రెండింటి ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
- ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే.. వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఇద్దరిలో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు. వయస్సులో సమానత్వం ఉంటే, అంతకుముందు విద్యార్హత ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంటారు.
- మెరిట్ లిస్ట్ ని యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచుతారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
- ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ని విడుదల చేస్తారు. యూనిర్సిటీ వెబ్ సైట్ లో వీటిని చూడవచ్చు.
జీతం వివరాలు:
NTR University Outsourcing Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు ఉంటాయి.
పోస్టు పేరు | పే స్కేల్ |
సిస్మ్ అడ్మినిస్ట్రేటర్ | రూ.31,500/- |
కంప్యూటర్ ఆపరేటర్ | రూ.21,500/- |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | రూ.18,500/- |
దరఖాస్తు విధానం:
NTR University Outsourcing Jobs 2025 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |