NTPC EET Recruitment 2026 : దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన NTPC Limited ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Engineering Executive Trainee (EET) పోస్టులను GATE-2025 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 515 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఒక సంవత్సరం ట్రైనింగ్, మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లభిస్తాయి.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
- Electrical – 165
- Mechanical – 210
- Electronics/Instrumentation – 125
- CS/IT – 15
అర్హతలు (Educational Qualification)
NTPC EET Recruitment 2026 అభ్యర్థులు సంబంధిత విభాగంలో B.E / B.Tech / AMIE డిగ్రీ కనీసం 65% మార్కులు (SC/ST/PwBDకు 55%)తో పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయవచ్చు. అయితే జాయినింగ్ సమయానికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. GATE-2025లో సంబంధిత పేపర్ రాసి ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
NTPC EET Recruitment 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ నాటికి అభ్యర్థి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- General / EWS / OBC అభ్యర్థులు ₹300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC / ST / PwBD / XSM / మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
- ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
NTPC EET Recruitment 2026 ఎంపిక పూర్తిగా GATE-2025 స్కోర్ ఆధారంగా ఉంటుంది. GATE మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది మెరిట్ లిస్ట్ GATE స్కోర్ + ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా రూపొందుతుంది. మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి.
జీతం వివరాలు (Salary Details)
NTPC EET Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో ₹40,000 – ₹1,40,000 (E1 గ్రేడ్) జీతం ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత స్థిర నియామకం ఉంటుంది. DA, HRA, మెడికల్ సదుపాయాలు, పెన్షన్ స్కీమ్ వంటి ప్రయోజనాలు NTPC నియమాల ప్రకారం వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
NTPC EET Recruitment 2026 అభ్యర్థులు www.ntpc.co.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ముందుగా GATE-2025 రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ప్రారంభం: 11-02-2026
- చివరి తేదీ: 25-02-2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : PNB Apprentice Recruitment 2026 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5138 పోస్టులు