NRF Sports Quota Recruitment 2025: ఇండియన్ రైల్వేలో ఉద్యోగం అనేది చాలా మందికి కల. ఇప్పుడు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి గొప్ప అవకాశం వచ్చింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NRF Sports Quota Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
సంస్థ | నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) |
నోటిఫికేషన్ నంబర్ | 03/2025 |
ఖాళీలు | 56 పోస్టులు |
దరఖాస్తు ప్రారంభం | 16.09.2025 |
చివరి తేదీ | 15.10.2025 |
ఎంపిక విధానం | స్పోర్ట్స్ ట్రయల్స్ + ఇంటర్వ్యూ |
అధికారిక వెబ్‌సైట్ | www.nfr.indianrailways.gov.in |
Also Read : RRB Section Controller Jobs 2025 | రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులు
ఖాళీల వివరాలు :
నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) నుంచి స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, గోల్ఫ్ మొదలైన క్రీడలలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. పురుషులు & మహిళల కోసం వేర్వేరు కేటగిరీల్లో మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 56
పే లెవల్ | ఖాళీలు |
Level 5/4 | 05 |
Level 3/2 | 13 |
Level 1 | 38 |
అర్హతలు :
NRF Sports Quota Recruitment 2025 పే లెవల్ ని బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- Level 5/4 (GP ₹2800/2400) : గ్రాడ్యుయేషన్
- Level 3/2 (GP ₹2000/1900) : 12వ తరగతి ఉత్తీర్ణత
- Level 1 (GP ₹1800) : 10వ తరగతి / ITI / NAC
వయోపరిమితి :
NRF Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఏ కేటగిరీకి కూడా వయోసడలింపు వర్తించదు.
అప్లికేషన్ ఫీజు :
NRF Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ / EBC : రూ.250/-
ఎంపిక ప్రక్రియ:
NRF Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- స్పోర్ట్స్ ట్రయల్స్ (గేమ్ స్కిల్స్ & ఫిట్‌నెస్ టెస్టులు)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : ARIES Administrative and Technical Recruitment 2025 | ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ లో బంపర్ నోటిఫిషన్
జీతం వివరాలు :
NRF Sports Quota Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ ని బట్టి జీతాలు వేర్వురుగా ఉంటాయి.
- Level 5/4: ₹29,200 – ₹92,300 వరకు
- Level 3/2: ₹21,700 – ₹69,100 వరకు
- Level 1: ₹18,000 – ₹56,900 వరకు
దరఖాస్తు విధానం :
NRF Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సదర్శించాలి.
- NRF Sports Quota Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
3 thoughts on “NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్”