By Jahangir

Published On:

Follow Us
NPCIL Recruitment 2025

NPCIL Recruitment 2025 |  న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుజరాత్ సైట్ లో ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ / స్టైపెండియరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

NPCIL Recruitment 2025

పోస్టుల వివరాలు : 

గుజరాత్ లోని కాక్రాపర్ సైట్ లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ / స్టైపెండియరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
సైంటిఫిక్ అసిస్టెంట్ ( డిప్లొమా మరియు సైన్స్ గ్రాడ్యుయేట్)11
సైంటిఫిక్ అసిస్టెంట్ (ప్లాంట్ ఆపరేటర్ మరియు మెయింటెయినర్)166
అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్)09
అసిస్టెంట్ గ్రేడ్-1 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)06
అసిస్టెంట్ గ్రేడ్ -1 (C&MM)05

అర్హతలు : 

NPCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ / బీఎస్సీ / డిప్లొమా / ఐటీఐ / 12వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

వయస్సు: 

NPCIL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

  • స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు
  • స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 24 సంవత్సరాలు
  • అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు 21 నుంచి 28 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ: 

NPCIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. 

దరఖాస్తు విధానం: 

NPCIL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు గమనించి అధికారిక నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

ICFRE TRFI Group C Recruitment 2025
ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు  : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 06 – 2025
Short NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!