NPCC Recruitment 2025 | NPCCలో ఇంజనీర్, అసోసియేట్,  అసిస్టెంట్ పోస్టులు

NPCC Recruitment 2025 నేషనల్ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన ద్వారా వివిధ విభాగాల్లో ఇంజనీర్, అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు షెడ్యూల్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

NPCC Recruitment 2025

పోస్టుల వివరాలు : 

 మినీరత్న కేటగిరీ-1 కంపెనీ అయిన నేషనల్ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC) నుంచి సైట్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్), సీనియర్ అసోసియేట్ (ఐటీ, హెచ్ఆర్, లా, రాజ్ భాష, ఫైనాన్స్), అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : నేషనల్ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC)
  • పోస్టు పేరు : వివిధ విభాగాల్లో ఇంజనీర్, అసోసియేట్, అసిస్టెంట్
  • పోస్టుల సంఖ్య : 45

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) –  ఐటీ04
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – హెచ్ఆర్04
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) -లా03
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – రాజ్ భాష02
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – ఫైనాన్స్02
సైట్ ఇంజనీర్ (సివిల్)10
సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)01
సైట్ ఇంజనీర్ (ఆర్కిటెక్ట్)01
అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్)18
మొత్తం పోస్టులు 45

అర్హతలు : 

NPCC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) –  ఐటీMCA లేదా కంప్యూటర్ సైన్స్ / ఐటీలోB.Tech
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – హెచ్ఆర్MBA (HR) లేదా హెచ్ఆర్ లో పోస్ట్ గ్రాడ్యయేషన్ డిగ్రీ
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) -లామూడేళ్ల LLB లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – రాజ్ భాషడిగ్రీలో స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తీసుకొని హిందీ / తత్సమానమైన మాస్టర్స్ డిగ్రీ
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – ఫైనాన్స్CA / CMA / MBA(ఫైనాన్స్) లేదా ఫైనాన్స్ లో పీజీ
సైట్ ఇంజనీర్ (సివిల్)సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
సైట్ ఇంజనీర్ (ఆర్కిటెక్ట్)ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్)ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ లో నిమిషానికి 50 పదాల టైపింగ్ స్పీడ్

వయస్సు : 

NPCC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏప్రిల్ 30, 2025 నాటికి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

NPCC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NPCC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అసిస్టెంట పోస్టులకు ఇంటర్వ్యూ జరిగే రోజు ముందుగా టైపింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. టైపింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు అనుమతిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాల్సి ఉంటుంది. 

జీతం వివరాలు : 

NPCC Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • సీనియర్ అసోసియేట్ & సైట్ ఇంజనీర్ : నెలకు రూ.33,750/-
  • అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్) : నెలకు రూ.25,000/-

దరఖాస్తు విధానం : 

NPCC Recruitment 2025 పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : 

పోస్టు పేరువాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ 
సైట్ ఇంజనీర్ (సివిల్)26 జూన్, 2025
సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)30 జూన్, 2025
సైట్ ఇంజనీర్ (ఆర్కిటెక్ట్)30 జూన్, 2025
సీనియర్ అసోసియేట్(ఆఫీస్ సపోర్ట్) – లా01 జూలై, 2025
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – రాజ్ భాష01 జూలై, 2025
సీనియర అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – ఫైనాన్స్01 జూలై, 2025
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – ఐటీ02 జూలై, 2025
సీనియర్ అసోసియేట్ (ఆఫీస్ సపోర్ట్) – హెచర్ఆర్02 జూలై, 2025
అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్)03 జూలై, 2025
NotificationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!