NMDFC Recruitment 2025 భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వివిధ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ తో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రచురించబడిన తేదీ నుంచి 30 రోజుల వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
NMDFC Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
డిప్యూటీ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ (ప్రాజెక్ట్, లీగల్ అండ్ రికవరీ) | 02 |
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్ అండ్ అడ్మిన్) | 01 |
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ | 05 |
అర్హతలు :
NMDFC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు వేరుగా ఉంటాయి.
- డిప్యూటీ మేనేజర్ : ఆర్ట్స్ / సైన్స్/ కామర్స్ లో 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత మరియు సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం.
- అసిస్టెంట్ మేనేజర్(ప్రాజెక్ట్, లీగల్ అండ్ రికవరీ) : ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ / అగ్రికల్చర్ సైన్స్ / స్టాటిస్టిక్స్ / మేనేజ్మెంట్ / ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ / బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో PG లేదా BE ఉత్తీర్ణులై ఉండాలి. MBA / LLB చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అసిస్టెంట్ మనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : కామర్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ లో పీజీ ఉత్తీర్ణఉలై ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్ అండ్ అడ్మిన్) : పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ / హెచ్ఆర్ లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా MBA/ LLB
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ : ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత మరియు టైపింగ్ స్కిల్స్
వయస్సు:
NMDFC Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాలు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
NMDFC Recruitment 2025 పోసుటులకు దరఖాస్తు చేసుకునే UR / OBC డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ. 600/- మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 200/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
NMDFC Recruitment 2025 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్ లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష విధానం మరియు సిలబస్ తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చోడవచ్చు.
జీతం :
NMDFC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతం |
డిప్యూటీ మేనేజర్ | రూ.40,000 – రూ.1,40,000/- |
అసిస్టెంట్ మేనేజర్ | రూ.30,000 – రూ.1,20,000/- |
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ | రూ.25,000- రూ.95,000/- |
దరఖాస్తు విధానం:
NMDFC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- చివరికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
NMDFC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రచురణ తేదీ కొరకు రెగ్యులర్ గా వెబ్ సైట్ ఫాలో అవ్వండి.
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |