NMDC Steel Recruitment 2025 ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టీల్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఛత్తీస్ గఢ్ లోని నాగర్నార్ లో ఉన్న NMDC Steel లిమిటెడ్ లో వివిధ సాంకేతిక మరియు సాంకేతికేతర విభాగాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
NMDC Steel Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టీల్ లిమిటెడ్ లో వివిధ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు స్టీల్ మెల్టింగ్ షాప్, లైమ్ డోలమైట్ కాల్సినేషన్ ప్లాంట్, థిన్ స్లాబ్ కాస్టర్ అండ్ హాట్ స్ట్రిప్ మిల్లు, ముడి పదార్థాల నిర్వహణ వ్యవస్థలు, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ అండ్ పీసీఎమ్, కోక్ ఓవెన్ మరియు ఉప ఉత్పత్తి కర్మాగారం, పరిశోధన నియంత్రణ ప్రయోగశాలలు, ఇన్ స్ట్రుమెంటేషన్, ఐటీ, సివిల్, హార్టికల్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, భద్రత, పర్యవరణం, సెంట్రల్ స్టోర్స్, ట్రాఫిక్ అండ్ లాజిస్టిక్స్ మరియు ఇతర విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నారు. ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కాబట్టి సంస్థ అవసరాలను బట్టి, పర్ఫార్మెన్స్ ఆధారంగా కాంట్రాక్ట్ కాల వ్యవధిని పెంచవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 934
కేటగిరీ | ఖాళీలు |
జనరల్ | 376 |
EWS | 93 |
OBC | 241 |
SC | 155 |
ST | 69 |
అర్హతలు :
NMDC Steel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, సివిల్, కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MBA / MCA / MSc(కెమిస్ట్రీ), CA / ICMA / డిప్లొమా / ITI / డిగ్రీ
అనుభవం :
- పోస్టును బట్టి అనుభవం అవసరం ఉంటుంది.
- ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు:
NMDC Steel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
NMDC Steel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
NMDC Steel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు రాయ్ పూర్, భువనేశ్వర్, రూర్కెలా, బొకారో, దుర్గాపూర్, హోస్ పేట్, ఝూర్సుగూడా ప్రాంతాల్లో జరుగుతాయి. అప్లికేషన్ ఫిల్ చేసేసమయంలో అభ్యర్థులు ఇంటర్వ్యూ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు వెరిఫైడ్ డాక్యుమెంట్స్ ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేయబడతాయి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు.
జీతం :
NMDC Steel Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఉంటుంది. పోస్టును అనుసరించి రూ.40,000/- నుంచి రూ.1,70,000/- వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
NMDC Steel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 – 04 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 -05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |