NITTTR Non Teaching Recruitment 2025 : నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చండీగఢ్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 09వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
దేశంలో ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్న వారు ఇలాంటి ఉద్యోగాలను మిస్ చేసుకోవద్దు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థలో వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 01 |
పర్సనల్ అసిస్టెంట్ | 02 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 02 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 | 02 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 04 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) | 05 |
మొత్తం | 16 |
Also Read : APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
అర్హతలు :
NITTTR Non Teaching Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం అవుతుంది.
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : మాస్టర్ డిగ్రీ + అనుభవం
- పర్సనల్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : ఏదైనా డిగ్రీ
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 : ఇంటర్ + స్టెనోగ్రఫీ
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 10వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి :
NITTTR Non Teaching Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 18 నుంచి 45 సంవత్సరాలు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 : 18 నుంచి 27 సంవత్సరాలు
- ఇతర పోస్టులకు : 18 నుంచి 35 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NITTTR Non Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : రూ.750/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / దివ్యాంగులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
NITTTR Non Teaching Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కీల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : MANUU Recruitment 2025 | నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జీతం వివరాలు :
NITTTR Non Teaching Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం చెల్లించడం జరుగుతుంది.
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : రూ67,700 – రూ.2,08,700/-
- పర్సనల్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : రూ.29,200 – రూ.92,300/-
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 : రూ.25,500 – రూ.81,100/-
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : రూ.19,900 – రూ.63,200/-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ.18,000 – రూ.56,900/-
దరఖాస్తు విధానం :
NITTTR Non Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15.10.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RCF Kapurthala Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కొత్త నోటిఫికేషన్
3 thoughts on “NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్”