NITTTR Chennai Recruitment 2025 చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 10వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం వివరాలు, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NITTTR Chennai Recruitment 2025
పోస్టుల వివరాలు:
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మూడు విభాగాల్లో కలిపి 12 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
సీనియర్ లైబ్రేరియన్ | 01 |
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ప్రొడక్షన ఎగ్జిక్యూటివ్) | 01 |
టెక్నికల్ ఆఫీసర్(ఎడిటర్) | 01 |
టెక్నికల్ ఆఫీసర్(ప్రొడక్షన్ అసిస్టెంట్) | 02 |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1 (కెమెరామెన్) | 01 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హిందీ ట్రాన్స్ లేటర్) | 01 |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2(కన్సోల్ ఆపరేటర్) | 01 |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టెనోగ్రాఫర్) | 02 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 02 |
అర్హతలు :
NITTTR Chennai Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
సీనియర్ లైబ్రేరియన్ | లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ డాక్యుమెంటేషన్ లో మాస్టర్ డిగ్రీ + యూనివర్సీ లైబ్రరీలో 13 సంవత్సరాల అనుభవం |
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్) | ME / M.Tech + 15 సంవత్సరాల అనుభవం |
టెక్నికల్ ఆఫీసర్ (ఎడిటర్) | బీఈ / బీటెక్ + 10 సంవత్సరాల అనుభవం |
టెక్నికల్ ఆఫీసర్ (ప్రొడక్షన్ అసిస్టెంట్) | బీఈ / బీటెక్ + 10 సంవత్సరాల అనుభవం |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1 (కెమెరామెన్) | సినిమాటోగ్రఫీలో డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హిందీ ట్రాన్స్ లేటర్) | ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా హిందీలో బ్యాచిలర్ డిగ్రీ |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2 (కన్సోల్ ఆపరేటర్) | కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా + 10 సంవత్సరాల అనుభవం |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టెనోగ్రాఫర్) | ఏదైనా డిగ్రీ + ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 100 పదాల స్పీడ్ మరియు ఇంగ్లీష్ టైపింగ్ లో నిమిషానికి 40 పదాల స్పీడ్ |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 10+2 ఉత్తీర్ణత + ఇంగ్లీష్ లో 30 పదాల టైపింగ్ స్పీడ్ |
వయస్సు:
NITTTR Chennai Recruitment 2025 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (ఎడిటర్) పోస్టులకు 45 సంవత్సరాలు, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టుకు 40 సంవత్సరాలు మరియు ఇతర పోస్టులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
NITTTR Chennai Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
NITTTR Chennai Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది.
- గ్రూప్ ఎ పోస్టులకు : ఇంటర్వ్యూ
- గ్రూప్ బి పోస్టులకు : రాత పరీక్ష
- గ్రూప్ సి పోస్టులకు : రాత పరీక్ష / స్కిల్ టెస్ట్
జీతం వివరాలు :
పోస్టు పేరు | జీతం |
సీనియర్ లైబ్రేరియన్ | రూ.57,700 – రూ.98,200/- |
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్) | రూ.67,700 – రూ.2,08,700/- |
టెక్నికల్ ఆఫీసర్ (ఎడిటర్) | రూ.56,100 – రూ.1,77,500/- |
టెక్నికల్ ఆఫీసర్ (ప్రొడక్షన్ అసిస్టెంట్) | రూ.56,100 – రూ.1,77,500/- |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1 | రూ.35,400 – 1,12,400/- |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హిందీ ట్రాన్స్ లేటర్) | రూ.29,200 – రూ.92,300/- |
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2 | రూ.29,200 – రూ.92.300/- |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టెనోగ్రాఫర్) | రూ.25,500 – రూ.81,100/- |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | రూ.19,900 – రూ.63,200/- |
దరఖాస్తు విధానం:
NITTTR Chennai Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
- స్వీయ అటెస్టెడ్ డాక్యుమెంట్లను జత పరిచి కింది చిరునామాకు పంపాలి.
హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా:
ది డైరెక్టర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, తారామణి, చెన్నై -600113, తమిళనాడు
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10- 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 09 – 06 – 2025
- హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ : 24 – 06 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
I want to join in job