NIT Non Teaching Recruitment 2025 జంషెడ్ పూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట ఆఫ్ టెక్నాలజీ(NIT) నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 11వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖస్తులు సమర్పించుకోవాలి.
NIT Non Teaching Recruitment 2025 Overview :
నియామక సంస్థ | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT), జంషెడ్ పూర్ |
పోస్టు పేరు | నాన్ టీచింగ్ స్టాఫ్ (గ్రూప్ A, B & C) |
పోస్టుల సంఖ్య | 33 |
జాబ్ లొకేషన్ | జంషెడ్ పూర్, జార్ఖండ్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | జూలై 11, 2025 |
పోస్టుల వివరాలు :
జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్ పూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. NIT అనేవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా దరఖస్తులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా NIT లు ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ ఫర్స్ పెట్టుకోవచ్చు.
గ్రూప్ A పోస్టులు :
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ : 01
- స్టూడెంట్ ఆక్టివిటీ & స్పోర్ట్స్ ఆఫీసర్ : 01
- అసిస్టెంట్ లైబ్రేరియన్ : 01
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 03
గ్రూప్ B పోస్టులు :
- టెక్నికల్ అసిస్టెంట్ : 05
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) : 01
- లైబ్రేరీ అండ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 01
- సూపరింటెండెంట్ : 03
గ్రూప్ C పోస్టులు :
- ఫార్మాసిస్ట్ : 01
- సీనియర్ అసిస్టెంట్ : 02
- జూనియర్ అసిస్టెంట్ : 05
- టెక్నీషియన్ : 07
- సీనియర్ టెక్నీషియన్ : 02
అర్హతలు :
NIT Non Teaching Recruitment 2025 పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
గ్రూప్ A పోస్టుల అర్హతలు :
పోస్టు పేరు | అర్హతలు |
ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ | BE / B.Tech (OR) MSc / MCA + 15 సంవత్సరాల అనుభవం |
స్టూడెంట్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ | ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. UGC NET అర్హత సాధించి ఉండాలి. |
అసిస్టెంట్ లైబ్రేరియన్ | లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ. NET / SLET / SET అర్హత |
అసిస్టెంట్ రిజిస్ట్రార్ | ఏదైనా మాస్టర్స్ డిగ్రీ |
గ్రూప్ B పోస్టుల అర్హతలు:
టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్) | సంబంధిత సబ్జెక్టుల్లో BE / B.Tech / MCA లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ |
జూనియర్ ఇంజనీర్ (సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech / Diploma |
లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ | సైన్స్ / ఆర్ట్స్ / కామర్స్ లోో బ్యాచిలర్ డిగ్రీ మరియు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ |
సూపరింటెండెంట్ | ఏదైనా డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ |
గ్రూప్ C పోస్టుల అర్హతలు :
ఫార్మసిస్ట్ | D.Pharma + రెండేళ్ల అనుభవం లేదా B.Pharma |
సీనియర్ అసిస్టెంట్ | 10+2 మరియు కనీసం నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్ మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ లో ప్రావీణ్యం |
జూనియర్ అసిస్టెంట్ | 10+2 మరియు కనీసం నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్ మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ లో ప్రావీణ్యం |
టెక్నీషియన్ (CSE, ECE, సివిల్, ప్రొడక్షన్, మెకానికల్) | 10+2 లేదా 10వ తరగతి మరియు ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా |
సీనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్, ఈసీఈ) | 10+2 లేదా 10వ తరగతి మరియు ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా |
వయోపరిమితి :
NIT Non Teaching Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ : 56 సంవత్సరాలు
- స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ : 35 సంవత్సరాలు
- అసిస్టెంట్ లైబ్రేరియన్ : 35 సంవత్సరాలు
- అసిస్టెంట రిజిస్ట్రార్ : 35 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
- జూనియర్ ఇంజనీర్ : 30 సంవత్సరాలు
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
- సూపరింటెండెంట్ : 30 సంవత్సరాలు
- ఫార్మసిస్ట్ : 27 సంవత్సరాలు
- సీనియర్ అసిస్టెంట్ : 33 సంవత్సరాలు
- జూనియర్ అసిస్టెంట్ : 27 సంవత్సరాలు
- టెక్నీషియన్ : 27 సంవత్సరాలు
- సీనియర్ టెక్నీషియన్ : 33 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
NIT Non Teaching Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | కేటగిరీ | ఫీజు |
గ్రూప్ ఎ | UR / OBC / EWS | 2,000/- |
గ్రూప్ బి | UR / OBC / EWS | 1,000/- |
గ్రూప్ సి | UR / OBC / EWS | 500/- |
- అన్ని పోస్టులకు SC / ST / PwBD / ExSm / Women అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
NIT Non Teaching Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- స్టేజ్-1 : కంప్యూటర్ ఆధారిత పరీక్ష : అన్ని పోస్టులకు ఉంటుంది. ప్రిన్సిపల సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు ఉండదు.
- స్టేజ్-2 : స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ / ఇంటర్వ్యూ : కంప్యూటర్ ఆధారిత పరీక్షలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో స్టేజ్-2 దశకు పిలుస్తారు.
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ : సూపరింటెండెట్, అసిస్టెంట్, టెక్నీషియన్ మొదలైన పోస్టులకు స్కిల్ / ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ : గ్రూప్ ఎ మరియు గ్రూప్ బిలో కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఫిజికల్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ : స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టుకు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
NIT Non Teaching Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం మంచి ప్యాకేజీతో జీతాలు చెల్లిస్తారు.
- ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ : రూ.1,44,200 – రూ.2,18,200/-
- స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ : రూ.56,100 – రూ.1,77500/-
- అసిస్టెంట్ లైబ్రేరియన్ : రూ.56,100 – రూ.1,77500/-
- అసిస్టెంట రిజిస్ట్రార్ : రూ.56,100 – రూ.1,77500/-
- టెక్నికల్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- జూనియర్ ఇంజనీర్ : రూ.35,400 – రూ.1,12,400/-
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- సూపరింటెండెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- ఫార్మసిస్ట్ : రూ.29,200 – రూ.92,300/-
- సీనియర్ అసిస్టెంట్ : రూ.25,500 – రూ.81,100/-
- జూనియర్ అసిస్టెంట్ : రూ.21,700 – రూ.69,100/-
- టెక్నీషియన్ : రూ.21,700 – రూ.69,100/-
- సీనియర్ టెక్నీషియన్ : రూ.25,500 – రూ.81,100/-
దరఖాస్తు విధానం :
NIT Non Teaching Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ విభాగంపై క్లిక్ చేయాలి.
- NIT Non Teaching Recruitment 2025 పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |