NIT Andhra Pradesh Recruitment 2025 |  టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. ఇవిగో వివరాలు

NIT Andhra Pradesh Recruitment 2025: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం సపరేట్ గా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

NIT Andhra Pradesh Recruitment 2025 Overview

నియామక సంస్థనేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్
పోస్టు పేరుటెక్నికల్ అసోసియేట్
పోస్టుల సంఖ్యనోటిఫికేషన్ లో ప్రకటించలేదు
దరఖాస్తు విధానంవాక్ ఇన్ ఇంటర్వ్యూ
జాబ్ టైప్కాంట్రాక్ట్ పద్ధతి

Also Read : CSIR IICT Recruitment 2025 | కెమికల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లయ్ చేయండి

ఖాళీల వివరాలు(Vacancy Details) : 

దేశంలో ప్రముఖ విద్యాసంస్థలలో ఒకటైన NIT ఆంధ్రప్రదేశ్ తాజాగా Technical Associate (Highly Skilled Category) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు థర్డ్-పార్టీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా జరుగుతాయి. 

  • పోస్ట్ పేరు: Technical Associate (Highly Skilled Category)
  • పోస్టుల సంఖ్య: సూచనాత్మకం మాత్రమే (ఇనిస్టిట్యూట్ అవసరాన్ని బట్టి పెరగవచ్చు/తగ్గవచ్చు)
  • కాలవ్యవధి: 6 నెలలు (ప్రదర్శన ఆధారంగా పొడిగింపు ఉంటుంది)

అర్హతలు(Eligibility) : 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో B.Tech/ B.E in CSE, ECE, IT లేదా Allied Disciplines లేదా MCA లేదా M.Sc in Computers / Networking / Allied ఉత్తీర్ణఉలై ఉండాలి. 

వయోపరిమితి(Age Limit) : 

NIT Andhra Pradesh Recruitment 2025 నోటిఫికేషన్‌లో స్పష్టమైన వయోపరిమితి ఇవ్వలేదు. కానీ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు(Application Fees) : 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process):

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలో అభ్యర్థులను బట్టి రాత పరీక్ష / పర్సనల్ ఇంటరాక్షన్ నిర్వహించవచ్చు. 

Also Read : GAIL Executive Trainee Recruitment 2026 | గేట్ స్కోర్ ఆధారంగా గ్యాస్ కంపెనీలో ఉద్యోగాలు

జీతం వివరాలు(Salary Details) : 

NIT Andhra Pradesh Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు Ministry of Labour & Employment, GOI నియమాల ప్రకారం కనీసం వేతనం ఉంటుంది.

  • కనీసం జీతం : రూ.22,000/-
  • అనుభవం మరియు అర్హతల ఆధారంగా ₹32,000/- వరకు ఇవ్వవచ్చు.

దరఖాస్తు విధానం (How to Apply): 

NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. 

  • అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • వాక్ ఇంటర్య్యూకు హాజరు అయ్యే సమయంలో అప్లికేషన్ తో పాటు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ ఫొటో కాపీలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 

ఇంటర్వ్యూ వేదిక(Venue)

  • Room No. 411, 4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT ఆంధ్రప్రదేశ్, Tadepalligudem, West Godavari District.

ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం

  • 08.10.2025 (ఉదయం 09:30 AM)
Notification & ApplicationClick here

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

2 thoughts on “NIT Andhra Pradesh Recruitment 2025 |  టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. ఇవిగో వివరాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!