NICL AO Recruitment 2025 నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో జనరలిస్టులు, ఐటీ, లీగల్, ఫైనాన్స్ మరియు మరిన్ని రంగాల్లో నిపుణులను ఎంపిక చేస్తారు. మొత్తం 266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 12వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
NICL AO Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో జనరలిస్ట్స్ మరియు స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సంస్థ పేరు : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- పోస్టు పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ) – స్కేల్-1
- పోస్టుల సంఖ్య : 266
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| జనరలిస్ట్ | 176 |
| డాక్టర్స్ (ఎంబీబీఎస్) | 10 |
| లీగల్ | 20 |
| ఫైనాన్స్ | 20 |
| ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 20 |
| ఆటో మొబైల్ ఇంజనీర్స్ | 20 |
| బ్యాక్ లాగ్ పోస్టులు | 5 |
అర్హతలు :
NICL AO Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరలిస్టులు : ఏదైనా స్ట్రీమ్ లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్
- డాక్టర్ : MBBS / MD / MS
- ఇతర స్పెషలిస్ట్ పోస్టులు : సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
NICL AO Recruitment 2025 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NICL AO Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
| కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
| UR / OBC / EWS | రూ.1,000/- |
| SC / ST | రూ.250/- |
ఎంపిక ప్రక్రియ:
NICL AO Recruitment 2025 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమ్స్ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఇంటర్వ్యూ
ప్రిలిమ్స్ పరీక్ష విధానం :
| సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | కాల వ్యవధి |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 | 35 | 20 నిమిషాలు |
| రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 | 30 | 20 నిమిషాలు |
| మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు |
మెయిన్స్ పరీక్ష విధానం (జనరలిస్టులకు) :
| సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | కాల వ్యవధి |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 50 | 50 | 40 నిమిషాలు |
| రీజనింగ్ | 50 | 50 | 40 నిమిషాలు |
| జనరల్ అవేర్నెస్ | 50 | 50 | 30 నిమిషాలు |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 40 నిమిషాలు |
| కంప్యూటర్ నాలెడ్జ్ | 50 | 50 | 30 నిమిషాలు |
| మొత్తం | 250 | 250 | 180 నిమిషాలు |
మెయిన్స్ పరీక్ష విధానం (స్పెషలిస్ట్) :
| సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | కాల వ్యవధి |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 | 30 నిమిషాలు |
| రీజనింగ్ | 40 | 40 | 35 నిమిషాలు |
| జనరల్ అవేర్నెస్ | 40 | 40 | 20 నిమిషాలు |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 | 35 నిమిషాలు |
| కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 40 | 25 నిమిషాలు |
| సంబంధిత స్ట్రీమ్ లో టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు | 50 | 50 | 35 |
| మొత్తం | 250 | 250 | 180 |
- డిస్క్రిప్టివ్ టెస్ట్ : డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు ఉంటుంది. 30 నిమిషాల సమయం ఇస్తారు. టెస్ట్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇందులో ఎస్సే రైటింగ్ – 10 మార్కులు, ప్రెసిస్ – 10 మార్కులు మరియు కాంప్రహెన్షన్ – 10 మార్కులు ఉంటాయి.
జీతం వివరాలు :
NICL AO Recruitment 2025 అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్ పోస్టులకు రూ.50,925 – రూ.96,765/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని మెట్రో పాలిటన్ కేంద్రాల్లో నెలకు సుమారు రూ.90,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
NICL AO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తులు ప్రారంభ తేదీ | 12 – 06 – 2025 |
| దరఖాస్తులకు చివరి తేదీ | 03 – 07 – 2025 |
| ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ | 20 – 07 – 2025 |
| మెయిన్స్ ఎగ్జామ్ తేదీ | 31 – 08 – 2025 |
| Notification | Click here |
| Apply Online | Click here |