NIACL Apprentice Recruitment 2025 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అప్రెంటిస్ నోటిఫికేషన్

NIACL Apprentice Recruitment 2025 ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

NIACL Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. భారతదేశం అంతటా మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీట్ల సమఖ్య తాత్కాలికం మరియు కంపెనీ అవసరాల ఆధారంగా మారవచ్చు. 

  • సంస్థ పేరు : న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)
  • పోస్టు పేరు : అప్రెంటిస్
  • ఖాళీల సంఖ్య : 500 

అర్హతలు : 

NIACL Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. ఏప్రిల్ 1, 2021 లేదా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ తేదీకి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు కారు. 

వయస్సు : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
UR / OBC రూ.944/-
SC / ST / Women రూ.708/-
PwBDరూ.472/-

ఎంపిక ప్రక్రియ: 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • ప్రాంతీయ భాష పరీక్ష 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.9,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

NIACL Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 06 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!