By Jahangir

Published On:

Follow Us
NIACL Apprentice Recruitment 2025

NIACL Apprentice Recruitment 2025 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అప్రెంటిస్ పోస్టులు

NIACL Apprentice Recruitment 2025 న్యూ ఇండియా అస్యూరెస్స్ కంపెనీ లిమిటెడ్  నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హత ఉన్న వారు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూన్ 6వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

NIACL Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చింది. NIACL అప్రెంటిస్ నియామకాలను చేపడుతుంది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మొత్తం అప్రెంటిస్ పోస్టులు : 500

అర్హతలు : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందినయూన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ప్రాంతీయ భాషపై నాలెడ్జ్ ఉండాలి. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

వయస్సు: 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కేటగిరి వారీగా ఫీజు వివరాలు కింద ఉన్నాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.944/-
SC / ST / Womenరూ.708/-
PwBDరూ.472/-

ఎంపిక ప్రక్రియ : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంపిక ప్రక్రియ యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి. 

ICFRE TRFI Group C Recruitment 2025
ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

NIACL Apprentice Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ ఉంటుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు నెలకు రూ.9,000/- స్టయిఫండ్ ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

NIACL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 06 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 06 – 2025
Short NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!