NHPC Recruitment 2025: భారతదేశంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డెవలప్మెంట్ సంస్థ అయిన NHPC Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యువ ప్రతిభావంతులు, డిప్లొమా/గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్‌లో ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు ఇలా అన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

NHPC Recruitment 2025 Overview
విభాగం | వివరాలు |
సంస్థ పేరు | NHPC Limited (National Hydroelectric Power Corporation) |
ప్రకటన నంబర్ | NH/Rectt./04/2025 |
పోస్టులు | నాన్ ఎగ్జిక్యూటివ్ |
అప్లికేషన్ మోడ్ | ఆన్ లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | www.nhpcindia.com |
దరఖాస్తు ప్రారంభం | 02-09-2025 |
చివరి తేదీ | 01-10-2025 |
Also Read : AP District Court Notification 2025 | ఏపీ జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details):
నేషనల్ హైడ్రోఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | మొత్తం ఖాళీలు |
అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి | 11 |
జూనియర్ ఇంజనీర్ (సివిల్) | 109 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | 46 |
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) | 49 |
జూనియర్ ఇంజనీర్ (ఇలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) | 17 |
సూపర్వైజర్ (ఐటీ) | 1 |
సీనియర్ అకౌంటెంట్ | 10 |
హిందీ ట్రాన్స్ లేటర్ | 5 |
అర్హతలు (Eligibility):
NHPC Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఇవ్వడం జరగింది.
- అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి : హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం
- జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/E&C) : 3 సంవత్సరాల డిప్లొమా (60% మార్కులు, SC/ST/PwBD – 50%)
- సూపర్వైజర్ (ఐటీ) : DOEACC ‘A’ Level OR CS/IT లో డిప్లొమా OR BCA/B.Sc (CS/IT)
- సీనియర్ అకౌంటెంట్ : Inter CA / Inter CMA Pass
- హిందీ ట్రాన్స్ లేటర్ : హిందీ/ఇంగ్లీష్ మాస్టర్స్ డిగ్రీ + 1 సంవత్సరం అనుభవం
వయోపరిమితి(Age Limit):
- గరిష్ట వయసు: 30 సంవత్సరాలు (01.10.2025 నాటికి)
- వయోసడలింపు:
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- PwBD – 10 నుండి 15 సంవత్సరాలు
- SC/ST – 5 సంవత్సరాలు
Also Read : Southern Railway Apprentice Recruitment 2025 | దక్షిణ రైల్వేలో 3518 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
అప్లికేషన్ ఫీజు(Application Fees):
NHPC Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC/EWS : ₹708/-
- SC/ST/PwD/Ex-Servicemen/Women : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process):
NHPC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- Computer Based Test (CBT) + Written Test (పోస్ట్ ఆధారంగా)
- కనీస అర్హత మార్కులు:
- General/OBC/EWS – 40%
- SC/ST/PwBD – 35%
- General/OBC/EWS – 40%
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాలు (Delhi, Hyderabad, Chennai, Kolkata, Mumbai మొదలైనవి)
జీతం వివరాలు(Salary):
- అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి : ₹40,000 – ₹1,40,000/-
- జూనియర్ ఇంజనీర్ & సూపర్వైజర్/సీనియర్ అకౌంటెంట్ (S1 Grade): ₹29,600 – ₹1,19,500/-
- హిందీ ట్రాన్స్ లేటర్ : ₹27,000 – ₹1,05,000
- అదనంగా HRA, DA, PRP, Medical, PF, Pension, Gratuity వంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
దరఖాస్తు విధానం(How to Apply)
NHPC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ సైట్ ద్వారా ఆన లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.nhpcindia.com లోకి వెళ్ళాలి.
- “Career” సెక్షన్‌లోకి వెళ్లి Online Application ఫారం ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత Application ID జనరేట్ అవుతుంది – దీన్ని భవిష్యత్ కోసం సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభం: 02-09-2025
- చివరి తేదీ: 01-10-2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : AP Prisons Department Recruitment 2025 | ఏపీ జైళ్ల శాఖలో సోషల్ వర్కర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు