NHAI Deputy Manager Recruitment 2025 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 – 1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NHAI Deputy Manager Recruitment 2025
పోస్టుల వివరాలు :
రోడ్డు రవాణ మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 60
అర్హతలు:
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ లో చెల్లుబాటు అయ్యే గేట్ 2025 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
- సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech
- గేట్ 2025 స్కోర్ కార్డు
వయస్సు:
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం గేట్ 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువ వస్తే, ఎంపిక కమిటీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
జీతం వివరాలు :
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 10 ప్రకారం రూ.56,100 నుంచి రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ డియర్నెస్ అలవెన్స్ మరయు హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు విధానం :
NHAI Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో ‘ప్రస్తుత ఖాళీలు’, ‘డిప్యూటీ మేనేజర్’, ‘ఆన్ లైన్ అప్లికేషన్’ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- ఫొటో, సంతకం మరియు ఇతర అవసరమైన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
- అప్లకేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9, 2025 సాయంత్రం 6.00 గంటలలోపు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 09 – 06 – 2025
| Notification | Click here |
| Apply Online | Click here |