NCRTC Non Executive Notification 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ మరియు జూనియర్ మెయింటెయినర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) – భారత ప్రభుత్వం మరియు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు యుపి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య జాయింట్ వెంచర్, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో నమో భారత్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది.
NCRTC Non Executive Notification 2025
పోస్టుల వివరాలు :
గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసిసోయేట్, అసిస్టెంట్ మరియు జూనియర్ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 72
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | 16 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) | 16 |
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) | 03 |
జూనియర్ ఇంజనీర్(సివిల్) | 01 |
ప్రోగ్రామింగ్ అసోసియేట్ | 04 |
అసిస్టెంట్ (హెచ్ఆర్) | 03 |
అసిస్టెంట్ (కార్పొరేట్ హాస్పిటాలిటీ) | 01 |
జూనియర్ మెయింటెయినర్(ఎలక్ట్రికల్) | 18 |
జూనియర్ మెయింటెయినర్ (మెకానికల్) | 10 |
అర్హతలు :
NCRTC Non Executive Notification 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాల కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
జూనియర్ ఇంజనీర్ | ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / మెకానికల్ / సివిల్ ట్రేడ్లలో 3 సంవత్సరాల డిప్లొమా |
ప్రోగ్రామింగ్ అసిసోయేట్ | కంప్యూటర్ సైన్స్ / ఐటీ లో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా BCA / BSc (Computers) / BSc (IT) |
అసిస్టెంట్ (హెచ్ఆర్) | BBA / BBM |
అసిస్టెంట్ (కార్పొరేట్ హాస్పిటాలిటీ) | హోటల్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ |
జూనియర్ మెయింటేయినర్ | సంబంధిత ట్రేడ్ లో ఐటీ సర్టిఫికెట్ |
వయస్సు:
NCRTC Non Executive Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NCRTC Non Executive Notification 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. కేటగిరిల వారీగా ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటడిరి | అప్లికేషన్ ఫీజు |
UR / OBC / EWS | రూ.1,000/- |
SC / ST / PwD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
NCRTC Non Executive Notification 2025 జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ మరియు జూనియర్ మెయింటేయినర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
NCRTC Non Executive Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి పేస్కేల్ మారుతుంది. పే స్కేల్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పే స్కేల్ |
జూనియర్ ఇంజనీర్ | రూ.22,800 – రూ.75,850/- |
ప్రోగ్రామింగ్ అసోసియేట్ | రూ.22,800 – రూ.75,850/- |
అసిస్టెంట్ | రూ.20,500 – రూ.65,500/- |
జూనియర్ మెయింటెయినర్ | రూ.18,250 – రూ.59,200/- |
దరఖాస్తు విధానం:
NCRTC Non Executive Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అక్కడ రిక్రూట్మెంట్ విభాగంలో అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24/03/2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24/05/2025 (పొడిగించబడింది)
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Extension of Closing Date | CLICK HERE |
Guntur
I have job please
I have interested in this job sir