Navy MR Agniveer (Musician) Recruitment 2025 అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్మెంట్ (MR) మ్యూజిషియన్ 02/2025 బ్యాచ్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళా అభ్యర్థులు జూలై 5వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Navy MR Agniveer (Musician) Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ఇండియన్ నేవీ |
పోస్టు పేరు | అగ్ని వీర్ (మెట్రిక్ రిక్రూట్-మ్యూజిషియన్) |
అప్లికేషన్ మోడ్ | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | పాన్ ఇండియా |
జీతం | రూ.30,000-40,000/- |
జాబ్ బేసిక్ | 4 సంవత్సరాలు |
పోస్టుల వివరాలు
సంగీత ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. Navy MR Agniveer (Musician) ఖాళీల వివరాలను నేవీ ప్రకటించలేదు.
అర్హతలు :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణత
- సంగీత వాయిద్యంలో నాలెడ్జ్
- గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంగీత అనుభవ ధ్రువీకరణ పత్రం.
శారీరక అర్హతలు :
పురుషులకు :
- ఎత్తు : 157 సెం.మీ
- పరుగు : 6.30 నిమిషాల్లో 1.6 కి.మీ.
- పుష్ అప్స్ : 12
- స్క్వాట్స్ : 20
మహిళలకు :
- ఎత్తు : 152 సెం.మీ
- పరుగు : 8 నిమిషాల్లో 1.6 కి.మీ
- స్క్వాట్స్ : 15
- వంగిన మోకాలి సిట్ అప్స్ : 10
వయస్సు :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 పోస్టులకు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2004 మరియు ఫిబ్రవరి 29, 2008 మధ్య జన్మించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.649/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ : 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఫిజికల్ టెస్ట్
- సంగీత నైపుణ్య పరీక్ష
- మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 అగ్నివీర్ పోస్టులకు నెలవారీ జీతం మొదటి సంవత్సరం రూ.30,000/- నుంచి ప్రారంభమవుతుంది.
- 1వ సంవత్సరం : రూ.30,000 (చేతికి రూ.21,000)
- 2వ సంవత్సరం : రూ.33,000 (చేతికి రూ.23,100)
- 3వ సంవత్సరం : రూ.36,500 (చేతికి రూ.25,550)
- 4వ సంవత్సరం : రూ.40,000 (చేతికి రూ.28,000)
దరఖాస్తు విధానం :
Navy MR Agniveer (Musician) Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో Navy MR Agniveer (Musician) 02/2025 Batch లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 5 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 13 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |