NALCO GET Recruitment 2026 | NALCOలో భారీ ప్యాకేజ్ తో జాబ్స్ – 110 పోస్టులు

NALCO GET Recruitment 2026 : నవరత్న కేంద్ర ప్రభుత్వ సంస్త అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో Graduate Engineer Trainee (GET) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.  ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను GATE 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఎంపికైన వారికి ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గా పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 2వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

ఖాళీల వివరాలు

NALCO సంస్థ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో 110 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • Mechanical Engineering : 59 పోస్టులు
  • Electrical Engineering : 27 పోస్టులు
  • Chemical Engineering : 24 పోస్టులు

మొత్తం ఖాళీలు: 110

Also Read : RRB Isolated Recruitment 2025 | రైల్వేలో డిగ్రీ & PG అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ – 312 పోస్టులతో నోటిఫికేషన్

అర్హతలు

NALCO GET Recruitment 2026 అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ BE / B.Tech డిగ్రీ ఉండాలి. ME / EE / CH పేపర్ కోడ్‌లలో GATE 2025 అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు. 

వయోపరిమితి

NALCO GET Recruitment 2026  అభ్యర్థులకు 22 జనవరి 2026 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. SC / ST / OBC / PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

 అప్లికేషన్ ఫీజు

NALCO GET Recruitment 2026 అభ్యర్థులు Net Banking / Debit Card / UPI (SBI Collect ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • UR / OBC / EWS: ₹500
  • SC / ST / PwBD / Departmental Candidates: ₹100

ఎంపిక ప్రక్రియ

NALCO GET Recruitment 2026 దరఖాస్తు చేసకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 

  • GATE 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్‌లిస్ట్ అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • తుది మెరిట్ జాబితా GATE – 90% మరియు ఇంటర్వ్యూ – 10% 

 జీతం వివరాలు

NALCO GET Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన జీతం ఉంటుంది. 

  • ట్రైనింగ్ సమయంలో జీతం: ₹40,000 – ₹1,40,000/-
  • ట్రైనింగ్ పూర్తి తర్వాత: Assistant Manager (E1 Grade)
  • రెగ్యులర్ పే స్కేల్: ₹60,000 – ₹1,80,000 + DA + ఇతర అలవెన్సులు

దరఖాస్తు విధానం

NALCO GET Recruitment 2026 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nalcoindia.com ని సందర్శించాలి.
  • కెరీర్ పేజీలో నోటిఫికేషన్ పై క్లిక్ చేసి, అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి
  • అవసరమైన డాక్యుమెంట్లు, GATE స్కోర్ వివరాలు అప్‌లోడ్ చేయాలి
  • ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభం : 2 జనవరి, 2026
  • చివరి తేదీ : 22 జనవరి, 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 501 ఖాళీలు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!