NaBFID Recruitment 2025| ఫైనాన్సింగ్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు

NaBFID Recruitment 2025 నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఆఫీసర్ (అనలిస్ట్ గ్రేడ్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. 

NaBFID Recruitment 2025

పోస్టుల వివరాలు : 

నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఆఫీసర్ (అనలిస్ట్  గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

మొత్తం పోస్టుల సంఖ్య : 66

పోస్టు విభాగంఖాళీలు
లెండింగ్ ఆపరేషన్స్ (లెండింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్)31
హ్యూమన్ రీసోర్సెస్02
అకౌంట్స్03
ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ01
లీగల్02
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్07
అడ్మినిస్ట్రేషన్01
రిస్క్ మేనేజ్మెంట్09
కార్పొరేట్ స్ట్రాటజీ, పార్టనర్ షిప్ అండ్ ఇకోసిస్టమ్ డెవలప్మెంట్07
కంప్లైయన్స్02
ఇన్టర్నల్ ఆడిట్01

అర్హతలు: 

NaBFID Recruitment 2025 పోస్టులకు స్ట్రీమ్ ప్రకారం విద్యార్హతలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • ఫైనాన్స్ , హెచ్ఆర్, లేదా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో MBA / PGDM
  • CA / ICWA / CFA
  • ఐటీ ఉద్యోగాలకు BE / B.Tech / MCA
  • లీగల్ పోస్టులకు లాలో మాస్టర్ డిగ్రీ

వయస్సు: 

NaBFID Recruitment 2025 ఆఫీసర్ (అనలిస్ట్ గ్రేడ్) పోస్టులకు దరఖాస్తు చేసకునే అభ్యర్థులకు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

 దరఖాస్తు ఫీజు: 

NaBFID Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 మరియు జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.100 మరియు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBC₹800 + GST
SC / ST / PDwBD₹100 + GST

ఎంపిక ప్రక్రియ: 

NaBFID Recruitment 2025 ఆఫీసర్ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్ లైన్ పరీక్ష విధానం: ఆన్ లైన్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 నిమిషాల సమయం ఇస్తారు. తప్పు జవాబుకు ¼ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

  • రీజనింగ్ అండ్ కాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 15 మార్కులు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 10 మార్కులు
  • డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ – 15 మార్కులు
  • ప్రొఫెషనల్ నాలెడ్జ్ – 40 మార్కులు

వ్యక్తిగత ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 30శాతం వెయిటేజీ కేటాయిస్తారు. ఆన్ లైన్ పరీక్షకు 70 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. రెండింటిలో పొందిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలు ముంబైలో జరుగుతాయి. 

జీతం :  

NaBFID Recruitment 2025 ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి ఆకర్షణీయమైన జీతం ఇస్తారు. సంవత్సరానికి దాదాపు రూ.14.83 లక్షల ప్యాకేజీతో జీతం లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.1,20,000/- జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం: 

NaBFID Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. తర్వాత స్కాన్ చేసిన సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం  అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ26 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ19 – 05 – 2025
తాత్కాలిక పరీక్ష లేదీమే / జూన్ 2025
అడ్మిట్ కార్డులు విడుదలపరీక్ష తేదీకి 10 రోజుల ముందు
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!