MECL Non Executive Recruitment 2025 మైన్స్ మినిస్ట్రీ పరిధిలోని మినీరత్న-1 PSU అయిన మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాలలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి పర్మినెంట్ ప్రభుత్వం ఉద్యోగాలు. అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
MECL Non Executive Recruitment 2025 Overview :
| నియామక సంస్థ పేరు | మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ |
| పోస్టు పేరు | నాన్- ఎగ్జిక్యూటివ్ |
| పోస్టుల సంఖ్య | 108 |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
| గరిష్ట వయస్సు | 30 సంవత్సరాలు |
పోస్టుల వివరాలు :
మినీరత్న-1 సెంట్రల్ పబ్లిక్ సెక్టార ఎంటర్ ప్రైజ్ అయిన మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీ దేశంలోని ఖనిజ వనరుల అన్వేషణలో కీలక పాత్ర పోషిస్తుంది.
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| అకౌంటెంట్ | 06 |
| హిందీ ట్రాన్స్ లేటర్ | 01 |
| టెక్నీషియన్ (సర్వే అండ్ డ్రాఫ్ట్స్ మన్) | 15 |
| టెక్నీషియన్ (సాంప్లింగ్) | 02 |
| టెక్నీషియన్ (లాబొరేటరీ) | 03 |
| అసిస్టెంట్ (మెటీరియల్స్) | 16 |
| అసిస్టెంట (అకౌంట్స్) | 10 |
| స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష) | 04 |
| అసిస్టెంట్ (హిందీ) | 01 |
| ఎలక్ట్రీషియన్ | 01 |
| మెషీనిస్ట్ | 05 |
| టెక్నీషియన్(డ్రిల్లింగ్) | 12 |
| మెకానిక్ | 01 |
| మెకానిక్ కమ్ ఆపరేటర్(డ్రిల్లింగ్) | 25 |
| జూనియర్ డ్రైవర్ | 06 |
| మొత్తం పోస్టులు | 108 |
అర్హతలు మరియ అనుభవం :
MECL Non Executive Recruitment 2025 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం కూడా అవసరం అవుతుంది. అర్హత మరియు అనుభవం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
| పోస్టు పేరు | అర్హత | అనుభవం |
| అకౌంటెంట్ | గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇంటర్మీడియట్ CA/ ICWA ఉత్తీర్ణత | సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం |
| హిందీ ట్రాన్స్ లేటర్ | గ్రాడ్యుయేట్ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులుగా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్. | అనువాదంలో 3 సంవత్సరాల అనుభవం |
| టెక్నీషియన్ (సర్వే అండ్ డ్రాఫ్ట్స్ మన్) | 10వ తరగతితో పాటు సర్వే / డ్రాఫ్ట్స్ మన్ షిప్ (సివిల్)లో ఐటీఐ | సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం |
| టెక్నీషియన్ (శాంప్లింగ్) | బిఎస్సీ | డ్రిల్ కోర్ / మైన్ శాంప్లింగ్ లో 3 సంవత్సరాల అనుభవం |
| టెక్నీషియన్ (లాబొరేటరీ) | కెమిస్ట్రీ / ఫిజిక్స్ / జియాలజీలో బీఎస్సీ | సంబంధిత ఫీల్డ్ లో 3 సంవత్సరాల అనుభవం |
| అసిస్టెంట్ (మెటీరియల్స్) | బీఎస్సీ లేదా బీకామ్ మరియు టైపింగ్ సర్టిఫికెట్ | 3 సంవత్సరాల అనుభవం |
| అసిస్టెంట్ (అకౌంట్స్) | బీకామ్ | అకౌంట్స్ లో 3 సంవత్సరాల అనుభవం |
| స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) | ఏదైనా డిగ్రీ + షార్ట్ హ్యాండ్ (నిమిషానికి 80 పదాలు) మరియు ఇంగ్లీష్ లో టైపింగ్ (నిమిషానికి 40 పదాలు) | స్టెనోగ్రాఫర్ గా 3 సంవత్సరాల అనుభవం |
| అసిస్టెంట్ (హిందీ) | హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో డిగ్రీ + హిందీ టైపింగ్ లో సర్టిఫికెట్ | 3 సంవత్సరాల అనుభవం |
| ఎలక్ట్రీషియన్ | 10వ తరగతి + ఐటీఐ(ఎలక్ట్రికల్) మరియు చెల్లుబాటు అయ్యే వైర్ మెన్ సర్టిఫికెట్ | 3 సంవత్సరాల అనుభవం |
| మెషినిస్ట్ | టర్నర్ / మెషినిస్ట్ / గ్రైండర్ / మిల్లర్ ట్రేడ్ లో ఐటీఐ | 3 సంవత్సరాల అనుభవం |
| టెక్నీషియన్(డ్రిల్లింగ్) | మెకానిక్(ఎర్త్ మూవింగ్ మెషినరీ) / డీజిల్ మెకానిక్ / మోటార్ మెకానిక్ / ఫిట్టర్ ట్రేడ్ లో ఐటీఐ | 3 సంవత్సరాల అనుభవం |
| మెకానికల్ | డిజిల్ / మోటార్ మెకానిక్ / ఫిట్టర్ ట్రేడ్ లో ఐటీఐ | 3 సంవత్సరాల అనుభవం |
| మెకానిక్ కమ్ ఆఫరేటర్ (డ్రిల్లింగ్) | మెకానిక్ / డీజిల్ మెకానిక్ / మోటార్ మెకానిక్ / ఫిట్టర్ ట్రేడ్ లో ఐటీఐ | 3 సంవత్సరాల అనుభవం |
| జూనియర్ డ్రైవర్ | 10వ తరగతి + హెవీ లైసెన్స్ | 3 సంవత్సరాల అనుభవం |
వయస్సు :
MECL Non Executive Recruitment 2025 నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 20.05.2025 తేదీ నాటికి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
MECL Non Executive Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- UR / OBC / EWS : రూ.500/-
- SC / ST / PwD / EsM : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
MECL Non Executive Recruitment 2025 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కింద దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ నాగ్ పూర్ నగరంలో మాత్రమే నిర్వహించబడుతుంది.
- అప్లికేషన్ల స్క్రీనింగ్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- నైపుణ్య పరీక్ష / ట్రేడ్ టెస్ట్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
MECL Non Executive Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వేర్వేరు పే స్కేల్స్ ఇవ్వడం జరుగుతుంది.
- అకౌంటెంట్, హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులకు : రూ.22,900 – రూ.55,900/-
- టెక్నీషియన్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర పోస్టులకు : రూ.20,000 – రూ.49,300/-
- జూనియర్ డ్రైవర్ : రూ.19,600 – రూ.47,900/-
దరఖాస్తు విధానం :
MECL Non Executive Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలోకి వెళ్లాలి.
- రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 – 06 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 05 – 07 – 2025
| Notification | Click here |
| Apply Link | Click here |