By Jahangir

Published On:

Follow Us
MECL Executive Trainee Recruitment 2025

MECL Executive Trainee Recruitment 2025 | ఎమ్ఈసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

MECL Executive Trainee Recruitment 2025 మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజీ) మరియు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జియోఫిజిక్స్) పోస్టులు 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖస్తు  చేసుకోవాలి. 

MECL Executive Trainee Recruitment 2025

పోస్టుల వివరాలు : 

భారత  ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక మినీ రత్న-1 CPSE అయిన మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ దేశంలోని ఖనిజ వనరుల అన్వేషణలో కీలక పాత్ర పోషిస్తుంది.  దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉంది. MECL నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 30  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ  పోస్టులకు  ఎంపికైన అభ్యర్థులు దేశంలోని MECL ప్రాజెక్టులు, కార్యాలయాలు లేదా సంస్థలలో పనిచేయాల్సి ఉంటుంది. 

  • నియామక సంస్థ : మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్
  • పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
  • మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు పేరుఖాళీల సంఖ్య
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజీ)20
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ( జియోఫిజిక్స్)10

అర్హతలు : 

MECL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.

ECIL Senior Artisan  Recruitment 2025
ECIL Senior Artisan  Recruitment 2025 | ECILలో 125 సీనియర్ ఆర్టిసన్ పోస్టులకు నోటిఫికేషన్
  • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజి) : జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎర్త్ సైన్స్, ఎక్స్ ప్లోరేషన్ జియాలజి, మినరల్ ఎక్స్ ప్లోరేషన్ లేదా జియోలాజికల్ టెక్నాలజీలో కనీసం 60 శాతం మార్కులతో  MSc / M.Tech / MSc.Tech లేదా తత్సమాన అర్హతలు ఉండాలి. అన్ని డిగ్రీలు UGC & AICTE ద్వారా అమోదించబడాలి. ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీలు అనుమతించబడవు.  
  • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియోఫిజిక్స్) : జియో ఫిజిక్స్ , అప్లైడ్ జియో ఫిజిక్స్, లేదా జియో ఫిజికల్ టెక్నాలజీలో కనీసం 60 శాతం మార్కులతో MSc / M.Tech / MSc.Tech లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. అన్ని డిగ్రీలు UGC & AICTE ద్వారా అమోదించబడాలి. ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీలు అనుమతించబడవు.  

వయస్సు: 

MECL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 23-04-2025 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

MECL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.500/-
SC / ST / ExSm / Departmental Candidatesఫీజు లేదు

ఎంపిక విధానం : 

MECL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల ఎంపిక ప్రక్రియ UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2023కి అనుసంధానించబడింది. 

SSC MTS Recruitment 2025
SSC MTS Recruitment 2025 | 10th అర్హతతో MTS మరియు హవల్దార్ పోస్టులు
  • UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2023 యొక్క రాత పరీక్షలో ఉత్తీర్ణులై, పోస్టులకు ఎంపిక కానీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడం జరుగుతంది. 
  • UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2023లో రాత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు MECL నియామకాల ప్రకారం ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • అభ్యర్థులకు ప్రత్యేకంగా పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహించరు. 
  • షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

జీతం వివరాలు : 

MECL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్  ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: 

MECL Executive Trainee Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు  క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 05,  2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!