MDL Trade Apprentice Recruitment 2025 రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ట్రేడ్ అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
MDL Trade Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు :
మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 523 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- సంస్థ పేరు : మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్
- పోస్టు పేరు : ట్రేడ్ అప్రెంటిస్
- పోస్టుల సంఖ్య : 523
ఖాళీల వివరాలు :
గ్రూప్ | ట్రేడ్స్ | ఖాళీలు |
గ్రూప్ ‘ఎ’ | డ్రాఫ్ట్స్ మన్ (మెకానిక్), ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్ | 194 |
గ్రూప్ ‘బి’ | ఫిట్టర్ స్ట్రక్చరల్, డ్రాఫ్ట్స్ మన్(మెకానిక్), ఎలక్ట్రీషియన్, ఐసిటిఎస్ఎం, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆర్ఎసి, పైప్ ఫిట్టర్, వెల్డర్, సిఓపిఎ, కార్పెంటర్ | 285 |
గ్రూప్ ‘సి’ | రిగ్గర్, వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్) | 44 |
అర్హతలు :
MDL Trade Apprentice Recruitment 2025 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- గ్రూప్ ‘ఎ’ : అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- గ్రూప్ ‘బి’ : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- గ్రూప్ ‘సి’ : అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి.
వయస్సు :
MDL Trade Apprentice Recruitment 2025 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- గ్రూప్ ‘ఎ’ : 15 నుంచి 19 సంవత్సరాలు
- గ్రూప్ ‘బి’ : 16 నుంచి 21 సంవత్సరాలు
- గ్రూప్ ‘సి’ : 14 నుంచి 18 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు :
MDL Trade Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100/- + బ్యాంక్ చార్జీలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
MDL Trade Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
MDL Trade Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
MDL Trade Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో కెరీర్ ‘కెరీర్’ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఆన్ లైన రిక్రూట్మెంట్ పై క్లిక్ చేసి, అప్రెంటిస్ విభాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
Notification | Click here |
Apply Online | Click here |