MANAGE Recruitment 2025 | వ్యవసాయ సంస్థలో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

MANAGE Recruitment 2025 నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ‘సి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 07 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

MANAGE Recruitment 2025 Overview : 

నియామక సంస్థనేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్
పోస్టు పేరుగ్రూప్ సి (స్టెనోగ్రాఫర్, క్లర్క్, MTS మరియు ఇతర పోస్టులు)
జాబ్ కేటగిరిరెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య07
జీతంరూ.18,000 – రూ.81,100/-
జాబ్ లొకేషన్హైదరాబాద్ 

పోస్టుల వివరాలు : 

హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో స్టెనోగ్రాఫర్, క్లర్క్, ఎంటీఎస్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి భారతదేశం పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి ఎంపికైన వారు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. 

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ స్టెనోగ్రాఫర్02
అప్పర్ డివిజన్ క్లర్క్01
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్01
మల్టీ టాస్కింగ్ స్టాఫ్03

అర్హతలు : 

MANAGE Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ స్టెనోగ్రాఫర్బ్యాచిలర్ డిగ్రీ + ఇంగ్లీష్ లో షార్ట్ హ్యాండ్ వేగం నిమిషానికి 80 పదాలు + ఇంగ్లీష్ లో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్
అప్పర్ డివిజన్ క్లర్క్బ్యాచిలర్ డిగ్రీ + ఇంగ్లీష్ లో నిమిషానికి 30 పదాలు స్పీడ్
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్సైన్స్ మరియు మ్యాథ్స్ తో 12వ తరగతి లేదా డిప్లొమా (ఐటీ లేదా సీఎస్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఐటీ లేదా సీఎస్)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్10వ తరగతి + కంప్యూటర్ సర్టిఫికెట్

వయస్సు: 

MANAGE Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : 18 నుంచి 32 సంవత్సరాలు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ : 18 నుంచి 27 సంవత్సరాలు
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 18 నుంచి 27 సంవత్సరాలు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18 నుంచి 30 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు : 

MANAGE Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు ఆఫ్ లైన్ ద్వారా చెల్లించాలి. ‘MANAGE’ Payable at Hyderabad పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / ఈఎస్ఎం / మహిళా అభ్యర్థులు అన్ని పోస్టులకు రూ.150/- ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

MANAGE Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • రాత పరీక్ష : ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానానికి ¼ నెగిటివ్ మార్కులు ఉంటాయి.
  • స్కిల్ టెస్ట్ : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 
  • మెరిట్ లిస్ట్ : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

జీతం వివరాలు :

MANAGE Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-1 నుంచి లెవల్-4 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ : రూ.25,500 – రూ.81,100/-
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : రూ.19,900 – రూ.63,200/-
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : రూ.18,000 – రూ.56,900/-

దరఖాస్తు విధానం : 

MANAGE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. 
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ స్వీయ ధ్రువీకరణ కాపీలను  జత చేయాలి. 
  • పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్స్ సెట్ ని కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి. 

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్: 

  • డిప్యూటీ డైరెక్టర్(పరిపాలన), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE), రాజేంద్ర నగర్, హైదరాబాద్ – 500030, తెలంగాణ

ముఖ్యమైన  తేదీలు : 

  • దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 28 – 07 – 2025
NotificationClick here
Application FormClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!