LIC HFL  Apprentice Recruitment 2025 | LIC హౌసింగ్ ఫైనాన్స్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్

LIC HFL  Apprentice Recruitment 2025 లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కొత్తగా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు  జూన్ 28వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. 

LIC HFL  Apprentice Recruitment 2025 Overview : 

నియామక సంస్థ  పేరుLIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
పోస్టు పేరుఅప్రెంటిస్
పోస్టుల సంఖ్య250
జాబ్  లొకేషన్భారతదేశం అంతటా
దరఖాస్తు విధానంఆన్ లైన్
స్టైఫండ్రూ.12,000/-
అప్రెంటిస్ పీరియడ్12 నెలలు
అప్రెంటిస్ షిప్ ప్రారంభంజూలై 14, 2025 (తాత్కాలికం)

పోస్టుల వివరాలు : 

LIC HFL  Apprentice Recruitment 2025 :  BFSI రంగంలో ట్రైనింగ్ మరియు ఎక్స్ పీరియన్స్ కోరుకునే గ్రాడ్యుయేట్స్  అభ్యర్థులకు LIC హౌసింగ్ ఫైనాన్స్ గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్రెంటిస్ షిప్ ఫైనాన్స్ సర్వీసెస్ లో రియల్ టైమ్ ఎక్స్ పోజర్ మరియు పూర్తి అయిన తర్వాత ప్రొఫెషియన్సీ సర్టిఫికెట్ అందిస్తుంది. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 250
  • వీటిలో ఆంధ్రప్రదేశ్ లో 20, తెలంగాణలో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు : 

LIC HFL  Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు  పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా  విభాగంలో డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి. 

  • గ్రాడ్యుయేషన్ 01 – 06 – 2021 మరియు  01 – 06 – 2025 మధ్య పూర్తి చేసి  ఉండాలి.
  • అభ్యర్థులు ఏ సంస్థతోనూ ముందస్తు అప్రెంటిస్ షిప్ చేసి ఉండకూడదు. 

 వయస్సు : 

LIC HFL  Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు  ఫీజు  : 

LIC HFL  Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
UR / OBCరూ.944/-
SC / ST / Womenరూ.708/-
PwBDరూ.472/-

ఎంపిక ప్రక్రియ: 

LIC HFL  Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు  కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష : BFSI  సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆన్ లైన్ రిమోట్ ప్రొక్టర్డ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఇస్తారు.
  • బేసిక్ బ్యాంకింగ, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, డిజిటల్ అండ్  కంప్యూటర్ లిటరసీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్ష విధానం :  అభ్యర్థులు ఫ్రంట్  కెమెరా మరియు ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఇంటి నుంచే పరీక్ష రాయవచ్చు.
  • డాక్యుమెంట్  వెరిఫికేషన్  మరియు పర్సనల్ ఇంటర్వ్యూ: ప్రవేశ పరీక్షలో క్వాలిపై అయిన  అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్  చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • ఫైనల్ సెలక్షన్ : ప్రవేశ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలో  పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైఫండ్ వివరాలు :   

LIC HFL  Apprentice Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిర్ణీత కాలానికి అప్రెంటిస్ షిప్ ఉంటుంది. అప్రెంటిస్ షిప్ సమయంలో అభ్యర్థులకు  స్టైఫండ్ చెల్లిస్తారు. నెలకు రూ.12,000/- స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ షిప వ్యవధి 12 నెలలు ఉంటుంది.

దరఖాస్తు విధానం : 

LIC HFL  Apprentice Recruitment 2025  అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు  ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. 

  • అభ్యర్థులు  అధికారిక NATS పోర్టల్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది. 
  • ఇప్పటికే నమోదు చేసుకోకపోతే ‘Student Category’ కింద నమోదు చేసుకోండి.
  • LICHFL  అప్రెంటిస్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ13 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ28 జూన్, 2025
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ30 జూన్,  2025
ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష03 జూలై, 2025
డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ08 జూలై నుంచి 09 జూలై
ఆఫర్ లెటర్స్  జారీ 10 జూలై నుంచి 11 జూలై
అప్రెంటిస్ షిప్ ప్రారంభ తేద14 జూలై,  2025 (తాత్కాలికం)
NotificationClick here
Apply Online (NATS Portal)Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!