KCTB Clerk Recruitment 2025: కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు(KCTB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

KCTB Clerk Recruitment 2025 Overview
| నియామక సంస్థ | కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ |
| పోస్టు పేరు | క్లర్క్ కమ్ క్యాషియర్ |
| పోస్టుల సంఖ్య | 11 |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
| జాబ్ లొకేషన్ | కాకినాడ, ఆంధ్రప్రదేశ్ |
Also Read : RCF Kapurthala Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కొత్త నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు నుంచి క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : క్లర్క్ కమ్ క్యాషియర్
- పోస్టుల సంఖ్య : 11
అర్హతలు :
KCTB Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రెగ్యులర్ స్ట్రీమ్ లో కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
KCTB Clerk Recruitment 2025 అభ్యర్థులకు 18.08.2025 నాటికి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
KCTB Clerk Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / బీసీ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ : రూ.250/-
ఎంపిక ప్రక్రియ :
KCTB Clerk Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : NHAI AI Engineer Recruitment 2025 | రూ.2.5 లక్షల జీతంతో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి
జీతం వివరాలు :
KCTB Clerk Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.
- 1వ సంవత్సరం : రూ.15,000/-
- 2వ సంవత్సరం : రూ.18,000/-
- ప్రొబేషన్ తర్వాత అభ్యర్థులకు నిబంధల ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
KCTB Clerk Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26.09.2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : IB Security Assistant MT Jobs 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
2 thoughts on “KCTB Clerk Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టులు”