KIAL Recruitment 2025 | కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

KIAL Recruitment 2025 కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆపరేటర్ (ఫైర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూన్ 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

KIAL Recruitment 2025 Overview : 

నియామక సంస్థకన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్(KIAL)
పోస్టు పేరుజూనియర్ ఆపరేటర్(ఫైర్)
పోస్టుల సంఖ్య18
అర్హత12వ తరగతి
ఎంపిక ప్రక్రియరాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తులకు చివరి తేదీ10 జూలై, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఆపరేటర్ (ఫైర్) ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక వెబ్ సైట్ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : జూనియర్ ఆపరేటర్ (ఫైర్)
  • ఖాళీల సంఖ్య: 18

అర్హతలు : 

KIAL Recruitment 2025 జూనియర్ ఆపరేటర్(ఫైర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

ఫిజికల్ ఫిట్ నెస్ : 

  • ఎత్తు : 167 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు. మహిళా అభ్యర్థులు 162 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు. 
  • ఛాతీ : 81 సెం.మీ. మరియు కనీసం 5 సెం.మీ విస్తరణ
  • బరువు : 55 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.(మహిళా అభ్యర్థులకు 45 కిలోలు)
  • కంటి చూపు: దూర దృష్టి అద్దాలు లేకుండా రెండు కళ్లలో 6/6. అద్దాలు లేకుండా రెండు కళ్లలో సమీప దృష్టి N-5
  • హియరింగ్ అండ్ స్పీచ్ : నార్మల్ గా ఉండాలి.

వయోపరిమితి : 

KIAL Recruitment 2025 జూనియర్ ఆపరేటర్ పోస్టులకు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • 24 సంవత్సరాలు
  • ఫైర్ ఫైటింగ్ లో బేసిక్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (BTC) లేదా ICAO – సర్టిఫైడ్ కోర్సు ఉన్న అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
  •  ఎక్స్ సర్వీస మెన్ మరియు Evictee కేటగిరీ వారికి 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

KIAL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు దరఖాస్తు సమయంలో ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

KIAL Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష : అర్హత మార్కులు 50%. (BTC అర్హత కలిగిన వారికి మినహాయింపు)
  • ఫిజికల్ టెస్ట్ : 8 ఈవెంట్లలో కనీసం 5 లో అర్హత సాధించాలి.
  • డ్రైవింగ్ స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

జీతం : 

KIAL Recruitment 2025 జూనియర్ ఆపరేటర్ (ఫైర్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

KIAL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ‘కెరీర్’ విభాగంలోకి వెళ్లి, జూనియర్ ఆపరేటర్(ఫైర్) పోస్ట్ కింద ‘అప్లయ్ ఆన్ లైన్’ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు మరియు ఫొటో అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 26 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

1 thought on “KIAL Recruitment 2025 | కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!