IUAC Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్

IUAC Recruitment 2025 : ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్(IUAC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 4వ తేదీలోపు ఆన్ లైేన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో సంస్థ కాబట్టి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. 

IUAC Recruitment 2025 Overview

నియామక సంస్థఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్(IUAC)
పోస్టు పేరుస్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య3
జాబ్ టైప్గవర్నమెంట్ జాబ్
ఎగ్జామ్ టైప్నేషనల్ లెవల్
దరఖాస్తులకు చివరి తేదీ4 నవంబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్న్యూఢిల్లీ

Also Read : BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్

ఖాళీల వివరాలు : 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ నుంచి స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • స్టెనోగ్రాఫర్ : 01
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 02

అర్హతలు : 

IUAC Recruitment 2025 పోస్టులను అనుసరించి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు గమనించగలరు. 

  • స్టెనోగ్రాఫర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత + షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 80 పదాలు మరియు టైపింగ్ లో నిమిషానికి 40 పదాలు స్పీడ్ ఉండాలి. 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : మెట్రిక్యుటేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణత

వయోపరిమితి : 

IUAC Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది.

  • స్టెనోగ్రాఫర్ : 27 సంవత్సరాలు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 25 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

IUAC Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • జనరల్ / ఓబీసీ : రూ.500/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / మహిళలు : రూ.250/-

ఎంపిక ప్రక్రియ: 

IUAC Recruitment 2025 అభ్యర్థులను రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్

  • రాత పరీక్ష : జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్(100 మార్కులు, 2 గంటలు)
  • స్కిల్ టెస్ట్ : కంప్యూటర్ ఆపరేషన్స్ – ఎంఎస్ వర్డ్

స్టెనోగ్రాఫర్

  • రాత పరీక్ష : జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్(200 మార్కులు, 2 గంటలు)
  • స్కిల్ టెస్ట్ : షార్ట్ హ్యాండ్ 80 పదాలు, టైపింగ్ 40 పదాలు

Also Read : TGSRTC Driver & Shramik Recruitment 2025 | RTCలో భారీ నోటిఫికేషన్..1,743 పోస్టులు భర్తీ

జీతం వివరాలు : 

IUAC Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులక 7వ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (లెవల్-1) : రూ.18,000 – రూ.56,900/-
  • స్టెనోగ్రాఫర్ (లెవల్-4) : రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం : 

IUAC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.iuac.res.in/ ని సందర్శించాలి. 
  • Vacancies విభాగంలో IUAC Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ పై క్లిక్ చేసి ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 4 నవంబర్, 2025

NotificationClick here
Apply Online Click here

Also Read : Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్

2 thoughts on “IUAC Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!