ISRO VSSC Recruitment 2025 | విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ జాబ్స్

ISRO VSSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స మెన్ – బి, ఫార్మిసిస్ట్-ఎ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ISRO VSSC Recruitment 2025

పోస్టుల వివరాలు : 

తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మెన్ మరియు ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : ISRO విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
  • పోస్టు పేరు : టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మెన్ మరియు ఫార్మాసిస్ట్
  • పోస్టుల సంఖ్య : 64

పోస్టుల వారీగా ఖాళీలు

  • టెక్నీషియన్-బి : 56
  • డ్రాఫ్ట్స్ మెన్-బి : 07
  • ఫార్మాసిస్ట్-ఎ : 01

అర్హతలు : 

ISRO VSSC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి. 

పోస్టు పేరువిద్యార్హతలు
టెక్నీషియన్-బి మరియు డ్రాఫ్ట్స్ మెన్-బిసంబంధిత ట్రేడ్ లో ఐటీఐ నుంచి సర్టిఫికెట్
ఫార్మాసిస్ట్-ఎఫార్మసీలో డిప్లొమా

వయస్సు : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 

ఎంపిక విధానం : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ (వర్తిస్తే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. 

  • టెక్నీషియన్ మరియు డ్రాఫ్ట్స్ మెన్ : రూ.21,700 – రూ.69,100/-
  • ఫార్మసిస్ట్ : రూ.29,200 – రూ.92,300/-

దరఖాస్తు విధానం : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 2వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 02 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 – 06 – 2025
Short NotificationClick here

1 thought on “ISRO VSSC Recruitment 2025 | విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!