ISRO VSSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSC) తిరువనంతపురం నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్(రాజ్ భాష), డ్రైవర్, ఫైర్ మ్యాన్, కుక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ISRO VSSC Recruitment 2025
పోస్టుల వివరాలు :
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అసిస్టెంట్(రాజ్ భాష), డ్రైవర్, ఫైర్ మెన్, కుక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
అసిస్టెంట్ (రాజ్ భాష) | 02 |
లైట్ వెహికల్ డ్రైవర్ | 05 |
హెవీ వెహికల్ డ్రైవర్ | 05 |
ఫైర్ మెన్-ఎ | 03 |
కుక్ | 01 |
అర్హతలు:
ISRO VSSC Recruitment 2025 విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
అసిస్టెంట్ (రాజ్ భాష) | 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు హిందీలో నిమిషానికి 25 పదాల టైపింగ్ వేగం ఉండాలి. |
లైట్ వెహికల్ డ్రైవర్ | 10వ తరగతి మరియు చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
హెవీ వెహికల్ డ్రైవర్ | 10వ తరగతితో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
ఫైర్ మెన్-ఎ | 10వ తరగతి ఉత్తీర్ణత |
కుక్ | 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు 5 సంవత్సరాల అనుభవం |
వయస్సు:
ISRO VSSC Recruitment 2025 అసిస్టెంట్ (రాజ్ భాష) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు, డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలు, ఫైర్ మెన్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, కుక్ పోస్టుకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ISRO VSSC Recruitment 2025 అసిస్టెంట్ ( రాజ్ భాష), డ్రైవర్, ఫైర్ మెన్, కుక్ పోస్టులకు కింద దశల్లో ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- నైపుణ్య పరీక్ష (డ్రైవర్ మరియు కుక్ పోస్టులకు)
- శారీరక సామర్థ్య పరీక్ష(ఫైర్ మెన్ )
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం:
ISRO VSSC Recruitment 2025 అసిస్టెంట్ (రాజ్ భాష) పోస్టులకు లెవల్ 4 పేస్కేల్ మరియు ఇతర పోస్టులకు లెవల్ 2 పే స్కేల్ లో జీతాలు చెల్లిస్తారు.
పోస్టు పేరు | జీతం |
అసిస్టెంట్ (రాజ్ భాష) | రూ.25,500 – రూ.81,100/- |
డ్రైవర్, ఫైర్ మెన్, కుక్ పోస్టులకు | రూ.19,900 – రూ.63,200/- |
దరఖాస్తు విధానం :
ISRO VSSC Recruitment 2025 ఉద్యోగాలకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఏప్రిల్ 1వ తేేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 01 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 15 – 04 – 2025 |
- Notification : CLICK HERE