ISRO NRSC Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియ అర్హత గల అభ్యర్థులు మే 30వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రధానంగా హైదరాబాద్ మరియు షాద్ నగర్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
NRSC వివరాలు :
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ముఖ్యంగా ఉపగ్రహ డేటాను స్వీకరించడం, డేటా ఉత్తత్తులను ఉత్పత్తి చేయడం, వాటిని వినియోగదారులకు వ్యాప్తి చేయడం, విపత్తు నిర్వహణ మద్దతుతో సహా రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ కోసం పద్ధతులను అభివృద్ధి చేయడం, జియోస్పేషియల్ సేవలను అందించడం, గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను NRSC చేపడుతుంది. జాతీయ మరియు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ డేటా మరియు దేశంలోని అప్లికేషన్ అవసరాలను తీర్చడానికి మల్టీ క్యాంపస్ ద్వారా NRSC పనిచేస్తుంది.
ISRO NRSC Recruitment 2025
పోస్టుల వివరాలు:
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (పారెస్ట్రీ అండ్ ఎకాలజీ) | 02 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఇన్ఫర్మాటిక్స్) | 02 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియోలజీ) | 05 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఫిజిక్స్) | 02 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (అర్బన్ స్టడీస్) | 06 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (వాటర్ రీసోర్సెస్) | 04 |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఇన్ఫర్మేటిక్స్) | 10 |
అర్హతలు :
ISRO NRSC Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది ఇచ్చిన అర్హతలు ఉండాలి. అర్హతలు పోస్టును అనుసరించి మారుతాయి. సంబంధిత విభాగంలో చెల్లుబాటు అయ్యే గేడ్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ) | బోటనీ / ఫారెస్ట్రీ / ఎకాలజీ లో BSc తో పాటు బోటనీ / ఫారెస్ట్రీలో MSc |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఇన్ఫర్మేటిక్స్) | జియోఇన్ఫర్మేటిక్స్ లో ఎంఎస్సీ లేదా తత్సమాన పరీక్షతో పాటు ఫిజిక్స్ / మ్యాథ్స్ లో బీఎస్సీ |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియాలజీ) | జియాలజీ / అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ లేదా జియాలజీ / అప్లైడ్ జియాలజీలో బీఎస్సీ |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (జియో ఫిజిక్స్) | జియో ఫిజిక్స్ లో ఎంఎస్సీ / ఎంఎస్సీ టెక్ లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్/ మ్యాథ్స్ / జియాలజీ లో బీఎస్సీ |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (అర్బన్ స్టడీస్) | అర్బన్ ప్లానింగ్ / రీజనల్ ప్లానింగ్ లో ME / M.Tech లేదా ప్లానింగ్ లో BE / B.Tech / B.Arch |
సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ (వాటర్ రీసోర్స్) | సంబంధిత విభాగంలో ME / M.Tech లేదా BE / B.Tech |
వయస్సు:
ISRO NRSC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | వయస్సు |
ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ మరియు జియో ఫిజిక్స్ | 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. |
అర్బన్ స్టడీస్, వాటర్ రీసోర్స్, జియోఇన్ఫర్మేటిక్స్ | 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. |
దరఖాస్తు ఫీజు:
ISRO NRSC Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.750/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రాత పరీక్ష తర్వాత రూ.750/- రీఫండ్ లభిస్తుంది. మిగిలిన అభ్యర్థులకు రూ.500/- రీఫండ్ లభిస్తుంది. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ISRO NRSC Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరయు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
ISRO NRSC Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85,833/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ISRO NRSC Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |