ISRO NRSC Jobs 2025 | నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు

ISRO NRSC Jobs 2025 :  ISRO ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్-1,  ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు రీసెర్చ్ సైంటిస్ట్ తో సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 21వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ISRO NRSC Jobs 2025 Overview:

నియామక సంస్థనేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో
పోస్టు పేరుజూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్
పోస్టుల సంఖ్య34
దరఖాస్తులకు చివరి తేదీ11 జూలై, 2025
దరఖాస్తు విధానం ఆన్ లైన్
జాబ్ లొకేషన్NRSC క్యాంపస్ లు – హైదరాబాద్, షాద్ నగర్, ఢిల్లీ, మొదలైనవి

పోస్టుల వివరాలు : 

ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
రీసెర్చ్ సైంటిస్ట్04
ప్రాజెక్ట్ సైంటిస్ట్03
ప్రాజెక్ట్ అసోసియేట్10
జూనియర్ రీసెర్చ్ ఫెలో17

అర్హతలు : 

ISRO NRSC Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాల కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరువిద్యార్హతలు
జూనియర్ రీసెర్చ్ ఫెలోNET / Gate అర్హతతో ఫిజిక్స్ / ఓషనోగ్రఫీ / అట్మాస్పియరిక్ సైన్స్ / రిమోట్ సెన్సింగ్ లో మాస్టర్ డిగ్రీ 
ప్రాజెక్ట్ అసోసియేట్-1కంప్యూటర్ సైన్స్ / జియో ఇన్ఫర్మేటిక్స్ లో బీఈ / బీటెక లేదా సంబంధిత స్పెషలైజేషన్ తో ఎంఎస్సీ / ఎంటెక్
ప్రాజెక్ట్ సైంటిస్ట్సంబంధిత సబ్జెక్టులలో డాక్టోరల్ / మాస్టర్స్ డిగ్రీ
రీసెర్చ్ సైంటిస్ట్రిమోట్ సెన్సింగ్ / జిఐఎస్ / జియాలజీలో ఎంటెక్ / ఎంఎస్సీ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు : 

ISRO NRSC Jobs 2025 ఉద్యోగాలకు వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • JRF & RS(MSc ఆధారిత) : 28 సంవత్సరాలు
  • RS (M.Tech ఆధారిత) : 30 సంవత్సరాలు
  • ప్రాజెక్ట్ అసోసియేట్ / సైంటిస్ట్ : 35 సంవత్సరాలు
  • వయోసడలింపు : SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు : 

ISRO NRSC Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.250/-
SC / ST / PwD / Women / ExSmరూ.250 (ఎంపికకు హాజరైన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది)

ఎంపిక ప్రక్రియ: 

ISRO NRSC Jobs 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • అప్లికేషన్ స్క్రీనింగ్ : విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

పోస్టు పేరుజీతం(నెలకు)
రీసెర్చ్ సైంటిస్ట్రూ.56,100 + HRA + DA
ప్రాజెక్ట్ సైంటిస్ట్-1రూ.56,100 + HRA
ప్రాజెక్ట్ సైంటిస్ట్-బిరూ.56,100 + HRA 
ప్రాజెక్ట్ అసోసియేట్-1రూ.31,000 + HRA
జూనియర్ రీసెర్చ్ ఫెలోరూ.37,000 + HRA

దరఖాస్తు విధానం : 

ISRO NRSC Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • నోటిఫికేషన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అప్లికషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసమైన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించి,  దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 21 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 11 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!