ISRO ISTRAC Apprentice Recruitment 2025: ISRO టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC) నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ISTRAC సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ISRO ISTRAC Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు:
బెంగళూరులోని టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అప్రెంటిస్ ట్రేడ్ | ఖాళీలు |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 35 |
డిప్లొమా అప్రెంటిస్ | 05 |
ట్రేడ్(ITI) అప్రెంటిస్ | 35 |
అర్హతలు :
ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ట్రేడ్ ని బట్టి అర్హతలు ఉంటాయి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్ (2022 – 2024) సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / కమర్షియల్ ప్రాక్టీస్ (2022 – 2024) సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ (2022 – 2024) లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు మరియు విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టయిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – రూ.9,000/-
- డిప్లొమా అప్రెంటిస్ – రూ.8,000/-
- ట్రేడ్ అప్రెంటిస్ – రూ.7,000/-
దరఖాస్తు విధానం:
ISRO ISTRAC Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా NATS (nats.education.gov.in) పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 21వ తేదీలోపు సంబంధిత ప్రాంతీయ కేంద్రానికి సర్టిఫికెట్లు స్కాన్ చేసి ఈమెయిల్ చేయాలి.
ఈమెయిల్ ఐడీలు:
బెంగళూరు | apprmt_blr@istrac.gov.in |
లక్నో | apprmt_lko@istrac.gov.in |
శ్రీ విజయ పురం | apprmt_ixz@istrac.gov.in |
ముఖ్యమైన తేేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ | 27 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేేదీ | 21 – 04 – 2025 |
ఇంటర్వ్యూ తేదీలు | ఏప్రిల్ – మే 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |