IRCTC Recruitment 2026: రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థ IRCTC (Indian Railway Catering and Tourism Corporation) కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో Hospitality Monitors పోస్టులను కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ లేదా హాస్పిటాలిటీ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు ₹30,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఖాళీల వివరాలు
IRCTC విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 43 Hospitality Monitor పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో గత నోటిఫికేషన్‌కు సంబంధించిన 4 OBC బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రిజర్వేషన్ నియమాల ప్రకారం కేటగిరీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను అవసరాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నియమించవచ్చు.
అర్హతలు
IRCTC Recruitment 2026 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు హోటల్ మేనేజ్‌మెంట్ లేదా హాస్పిటాలిటీ సంబంధిత కోర్సులు పూర్తి చేసి ఉండాలి. B.Sc Hospitality & Hotel Administration, B.Sc Hotel Management, MBA Tourism & Hotel Management వంటి కోర్సులు అర్హతగా గుర్తించబడతాయి. సంబంధిత విద్యార్హత ఉంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
వయోపరిమితి
IRCTC Recruitment 2026 ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. వయస్సు లెక్కింపు 01 జనవరి 2026 నాటికి పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
IRCTC Recruitment 2026 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం నింపి నేరుగా ఇంటర్వ్యూ రోజున సమర్పించాలి. అయితే ఎంపికైన అభ్యర్థులు నియామక సమయంలో ₹25,000 సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
IRCTC Recruitment 2026 ఈ ఉద్యోగాలకు ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, అవసరమైన సర్టిఫికేట్లు మరియు ఫోటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థుల అర్హతలు మరియు ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు. అదనంగా రిజర్వ్ ప్యానెల్ కూడా రూపొందిస్తారు.
జీతం వివరాలు
IRCTC Recruitment 2026 ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000 వరకు జీతం (CTC) ఇవ్వబడుతుంది. అదనంగా ట్రైన్ డ్యూటీ సమయంలో రోజుకు ₹350 డైలీ అలవెన్స్, అవుట్ స్టేషన్ నైట్ స్టే ఉంటే ₹240 లాడ్జింగ్ ఛార్జ్, నేషనల్ హాలిడే అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం
IRCTC Recruitment 2026 ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం నింపి వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజున సమర్పించాలి. అప్లికేషన్‌తో పాటు విద్యార్హత సర్టిఫికేట్లు, వయస్సు రుజువు, కేటగిరీ సర్టిఫికేట్ మరియు ఫోటోలు తీసుకురావాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా చూపించాలి.
ఇంటర్వ్యూ వివరాలు
IRCTC సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- స్థలం: IRCTC South Central Zone Office, సికింద్రాబాద్
- తేదీలు: 12 మరియు 13 మార్చి 2026
- సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 వరకు
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు TA/DA ఇవ్వబడదు.
Official Notification & Application: Click here
Official Website : Click here
Also Read : IDBI JAM Recruitment 2026 : IDBI బ్యాంక్ లో భారీ జాబ్స్ – 1100 ఉద్యోగాలు