IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 501 ఖాళీలు

IOCL Apprentice Recruitment 2025: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థ Indian Oil Corporation Limited (Marketing Division – Northern Region) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Trade, Technician, Graduate Apprentice పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ శిక్షణ ద్వారా యువతకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు నెలవారీ స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పోస్టులు ఉన్నాయి.

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్, ట్రేడ్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 501 ఖాళీలు ఉన్నాయి.  ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇది ఓపెన్ అప్లికషన్ కాబట్టి దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసకోవచ్చు.

పోస్టులు:

  • టెక్నీషియన్ అప్రెంటిస్ :  Mechanical / Electrical / Civil / Electronics / Instrumentation
  • ట్రేడ్ అప్రెంటిస్ :  Fitter, Electrician, Electronics Mechanic, Instrument Mechanic, Machinist
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : Any Degree
  • ట్రేడ్ అప్రెంటిస్ : డేటా ఎంట్రీ ఆపరేటర్

Also Read : ITI Young Professional Recruitment 2025 | కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – 215 పోస్టులు

అర్హతలు (Educational Qualification)

IOCL Apprentice Recruitment 2025 పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి. అభ్యర్థులు ఫుల్ టైమ్ కోర్సులు చేసి ఉండాలి.  Part-time / Distance mode అర్హతలు అంగీకరించరు.

  • ట్రేడ్ అప్రెంటిస్: 10వ తరగతి + సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI (NCVT/SCVT)
  • టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత బ్రాంచ్‌లో 3 సంవత్సరాల Diploma (AICTE గుర్తింపు)
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఏదైనా డిగ్రీ (BA / BSc / BCom / BBA మొదలైనవి)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 12వ తరగతి

వయోపరిమితి (Age Limit)

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 31-12-2025 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee)

IOCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సని అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process)

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
అభ్యర్థులను అర్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.  షార్ట్‌లిస్ట్ అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

జీతం / స్టైపెండ్ వివరాలు (Stipend Details)

IOCL Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు Apprentices Act ప్రకారం నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. ఎంపికైన వారికి 12 నెలల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగ హక్కు ఉండదు.

దరఖాస్తు విధానం (How to Apply)

IOCL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

  1. Trade / Data Entry Apprentice : NAPS Portal లో రిజిస్టర్ అవ్వాలి
  2. Technician / Graduate Apprentice : NATS Portal లో రిజిస్టర్ అవ్వాలి
  3. IndianOil Establishment ID తో అప్లై చేయాలి
  4. తర్వాత ఇచ్చిన Microsoft Form కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభం: 27 డిసెంబర్ 2025 (10:00 AM)
  • చివరి తేదీ: 12 జనవరి 2026 (5:00 PM)
NotificationClick here
NATS PortalClick here
NAPS Portal Click here

Also Read : NABARD Young Professional Recruitment 2025 | నాబార్డ్ లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు – 70 వేలు జీతం

1 thought on “IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 501 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!