IOB Apprentice Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 750 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000/- స్టైపండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
IOB Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ |
పోస్టు పేరు | అప్రెంటీస్ |
పోస్టుల సంఖ్య | 750 |
దరఖాస్తు ప్రక్రియ | 10 ఆగస్టు – 20 ఆగస్టు, 2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
స్టైఫండ్ | నెలకు రూ.15,000/- |
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 750 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- పోస్టుల సంఖ్య : 750
అర్హతలు :
IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- డిగ్రీ ఫలితలు 01 ఏప్రిల్, 2021 మరియు 01 ఆగస్టు, 2025 మధ్య వచ్చి ఉండాలి.
- ఇతర సంస్థలో అప్రెంటిస్ షిప్ శిక్షణ తీసుకున్న వారు అనర్హులు.
వయస్సు :
IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.944/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు : రూ.708/-
- పీడబ్ల్యూబీడీ : రూ.472/-
ఎంపిక ప్రక్రియ:
IOB Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్థానిక భాష పరీక్ష
జీతం వివరాలు :
IOB Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ అందజేస్తారు.
- మెట్రో బ్రాంచిలు : నెలకు రూ.15,000/-
- అర్బన్ బ్రాంచిలు : నెలకు రూ.12,000/-
- సెమీ అర్బన్ / గ్రామీణ బ్రాంచిలు : రూ.10,000/-
దరఖాస్తు విధానం :
IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు https://bfsissc.com/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ పేజీకి నావిగేట్ చేయాలి.
- IOB Apprentice Program FY 2025-26 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- NATS / NAPS రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఫీజు చెల్లించేందుకు BFSI SSC నుంచి ఈమెయిల్ వస్తుంది.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |
NATS Portal Link | Click here |