IOB Apprentice Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 9వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IOB Apprentice Notification 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటీస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 750 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో 25, తెలంగాణలో 31 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
IOB Apprentice Notification 2025 లో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.
TMB Recruitment 2025 | తెలుగు వచ్చిన వారికి బ్యాంక్ జాబ్స్
వయస్సు :
IOB Apprentice Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
IOB Apprentice Notification 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600/-, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400/- ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
IOB Apprentice Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం :
IOB Apprentice Notification 2025 అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో అభ్యర్థులకు రూ.15,000/- వరకు స్టయిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IOB Apprentice Notification 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 – 03 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09 – 03 – 2025
- ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 12 – 03 – 2025
- పరీక్ష తేదీ : 16 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE