Indian Navy SSC Executive (IT) Recruitment 2025 ఇండియన్ నేవీ నుంచి బంపన్ నోటిఫికేషన్ విడుదలైంది. SSC ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 Overview:
నియామక సంస్థ | ఇండియన్ నేవీ |
పోస్టు పేరు | SSC ఎగ్జిక్యూటివ్ (ఐటీ) |
పోస్టుల సంఖ్య | 15 |
జీతం | రూ.56,100 – రూ.1,77,500/- |
దరఖాస్తు ప్రక్రియ | 2 ఆగస్టు – 17 ఆగస్టు, 2025 |
పోస్టుల వివరాలు :
కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో జనవరి 2026లో ప్రారంభమయ్యే కోర్సు కోసం ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. షార్ట సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో BE / B.Tech / M.Tech / MCA / MSc ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 2, 2001 మరియు జూలై 1, 2006 మధ్య (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- దరఖాస్తుల షార్ట్ లిస్ట్
- SSB ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 10 ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.80,000/- వరకు చేతికి అందుతుంది.
దరఖాస్తు విధానం :
Indian Navy SSC Executive (IT) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |