Indian Navy B.Tech Cadet Entry 2026 : దేశ సేవ చేయాలనే లక్ష్యంతో పాటు నేవీలో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు ఇది అరుదైన అవకాశం. Indian Navy ద్వారా 10+2 (B.Tech) Cadet Entry Scheme – July 2026 Course కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల B.Tech కోర్సు పూర్తి చేసి, Permanent Commission Officer గా ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందవచ్చు.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా కింది బ్రాంచ్‌లలో మొత్తం 44 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- Executive & Technical Branch (Engineering / Electrical) – 44 పోస్టులు
- ఇందులో మహిళలకు 7 పోస్టులు ఉన్నాయి.
- బ్రాంచ్ కేటాయింపు ట్రైనింగ్ సమయంలో ఇండియన్ నావల్ అకాడమీ (INA) లో జరుగుతుంది.
Also Read: NALCO GET Recruitment 2026 | NALCOలో భారీ ప్యాకేజ్ తో జాబ్స్ – 110 పోస్టులు
అర్హతలు (Educational Qualification)
Indian Navy B.Tech Cadet Entry 2026 ఈ ఎంట్రీకి అప్లై చేయాలంటే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- 10+2 (ఇంటర్మీడియట్) లేదా సమాన పరీక్ష పూర్తి చేసి ఉండాలి
- Physics, Chemistry, Mathematics (PCM) కలిపి కనీసం 70% మార్కులు
- English లో కనీసం 50% మార్కులు (10వ లేదా 12వ తరగతిలో)
- JEE (Main) – 2025 పరీక్ష రాసి ఉండాలి.
- SSB కాల్ లెటర్ JEE Main 2025 All India CRL ఆధారంగా వస్తుంది.
- అవివాహితులైన అభ్యర్థులే అర్హులు
వయోపరిమితి (Age Limit)
Indian Navy B.Tech Cadet Entry 2026 అభ్యర్థులు 02 జనవరి 2007 నుండి 01 జూలై 2009 మధ్యలో (రెండు తేదీలు కలిపి) జన్మించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు లేదు.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
Indian Navy B.Tech Cadet Entry 2026 ఈ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
Indian Navy B.Tech Cadet Entry 2026 అభ్యర్థుల ఎంపిక కింది దశలలో జరుగుతుంది.
- JEE (Main) 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- SSB ఇంటర్వ్యూ (Bangalore / Bhopal / Kolkata / Visakhapatnam)
- మెడికల్ టెస్ట్
- మెరిట్ లిస్ట్ (SSB మార్కుల ఆధారంగా)
జీతం వివరాలు (Pay & Benefits)
- ట్రైనింగ్ సమయంలో Cadet హోదా
- ట్రైనింగ్ పూర్తయ్యాక Sub Lieutenant గా నియామకం
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం + అలవెన్సులు
- మెడికల్ సదుపాయాలు, లీవ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటాయి.
- ట్రైనింగ్ ఖర్చు మొత్తం Indian Navy భరిస్తుంది.
శిక్షణ వివరాలు (Training Details)
- శిక్షణ స్థలం: Indian Naval Academy (INA), ఎజిమల
- వ్యవధి: 4 సంవత్సరాలు (B.Tech కోర్సు)
- కోర్సులు:
- Applied Electronics & Communication Engineering
- Mechanical Engineering
- Electronics & Communication Engineering
- కోర్సు పూర్తి చేసిన తర్వాత JNU ద్వారా B.Tech డిగ్రీ లభిస్తుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
Indian Navy B.Tech Cadet Entry 2026 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
- అధికారిక వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఫారమ్ నింపాలి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 03 జనవరి 2026
- చివరి తేదీ: 19 జనవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRB Isolated Recruitment 2025 | రైల్వేలో డిగ్రీ & PG అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ – 312 పోస్టులతో నోటిఫికేషన్